అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అలా వైకుంఠపురం లో సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల కాబోతున్న ఈ సినిమా పాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్ లో బాగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా సామజవరగమనా సాంగ్ అయితే యూట్యూబ్ లో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన ఏ సినిమా చేయని రికార్డులు క్రియేట్ చేసింది సోషల్ మీడియాలో. ఈ గ్రామంలో సినిమా విడుదల కాకముందే చాలామంది నెటిజన్లు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అందించిన సంగీతం సినిమాకి హైలెట్ గా నిలుస్తుంది పాటలు అదిరిపోయాయి అని కామెంట్ చేస్తున్నారు.


గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో తమన్... అరవింద సమేత వీర రాఘవ రెడ్డి సినిమా చేయగా తాజాగా రెండోసారి ఈ సినిమాతో అద్భుతమైన మ్యూజిక్ అందించడంతో 'అలా వైకుంఠపురం లో' సినిమాకి తమన్ సంగీతం హైలెట్ అని సినిమా విడుదల కాకముందే ఇండస్ట్రీలో కామెంట్ వినబడుతున్నాయి. అంతేకాకుండా ఈ సినిమాలో అల్లు అర్జున్ తో పాటుగా అక్కినేని సుశాంత్ నటించడంతో….సినిమాలో సుశాంత్ పాత్ర సినిమాకి హైలైట్ అవుతుందని...ముఖ్యంగా అల్లు అర్జున్ తో సుశాంత్ నటించే సన్నివేశాలు అద్భుతంగా త్రివిక్రమ్ చిత్రీకరించారని..సుశాంత్ ‘అలా వైకుంఠపురం లో’  సినిమాకి హైలెట్ అని సినిమా విడుదల కాకముందే ఫిలింనగర్ లో వార్తలు వినబడుతున్నాయి.


సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న ఈ సినిమా పై అల్లు అర్జున్ అభిమానులు భీభత్సమైన అంచనాలు పెట్టుకున్నారు. ముఖ్యంగా గురూజీ త్రివిక్రమ్ దర్శకత్వంలో గతంలో బన్నీ నటించిన రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్ కావడంతో...అలా వైకుంఠపురం లో సినిమాతో హ్యాట్రిక్ కొట్టాలని బన్నీ అభిమానులు ఆశిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: