ఈషా రెబ్బా.. చూడగానే అబ్బా అనిపించే అందాల బ్యూటీ. పొరుగింటి పుల్ల కూర రుచి అన్నట్టు తెలుగు డైరెక్టర్లు, యాక్టర్లు ఎంత సేపూ ముంబై భామల వెనకాలో.. కేరళ కుట్టీల వెనకాలో పడతారు తప్ప తెలుగందాలు ఊరిస్తున్నా పెద్దగా పట్టించుకోరు. ఇలా చెప్పేందుకు ఈషా రెబ్బానే ఓ ఉదారహణ. అచ్చ తెలుగు అమ్మాయిలా చూడగానే ఆకట్టుకునే ఈ ఈషా రెబ్బాకు మాత్రం ఇప్పటి వరకూ మంచి బ్రేక్ రాలేదనే చెప్పాలి.


బందిపోటు, అమీ తుమీ వంటి మూవీతో పరిచయం అయిన ఈ ముద్దు గుమ్మ జూనియర్ ఎన్టీయార్ త్రివిక్రం మూవీ అరవింద సమేతలో హీరో చెల్లెలు పాత్రలో కనిపించింది. అ సినిమాలో నిత్యామీనన్ తో లెస్బియన్ గానూ నటించి డేరింగ్ అనిపించుకుంది. సుమంత్ తో జత కట్టి చేసిన సుబ్రమణ్యపురం మూవీ కూడా మంచి పేరు తెచ్చింది.


ఆ తర్వాత ఒకటీ అరా సినిమాలు చేసినా పెద్దగా గుర్తింపు రాలేదు. త్వరలో ఈ అమ్మడు నటించిన రాగల 24 గంటల్లో అనే సస్పెన్స్ థ్రిల్లర్ రిలీజ్ కాబోతోంది. సెలెక్టివ్ గా మూవీస్ చేస్తున్న ఈషా రెబ్బ తన అందాల బంధాలతో అటు నెటిజన్లను, ఇటు ఫిల్మ్ మేకర్లను ఆకట్టుకునే ప్రయత్నాల్లో పడింది. తెలుగమ్మాయి తరహాలో ఫోటోలకు ఫోజులిస్తే సరిపోదనుకుందో ఏమో ఈసారి కాస్త డోస్ పెంచేసింది.


ముఖారవిందంతో పాటు తొడల అందాలు కూడా చూపిస్తూ కవ్విస్తోంది. ఈషా రెబ్బా తాజాగా ఇన్స్ట్రాగ్రాంలో పెట్టిన పోస్టింగులు కుర్రాళ్లను కిర్రెక్కించేలా ఉన్నాయి. అసలు ఈ గ్లామర్ గాల్ మన తెలుగు అమ్మాయేనా అని ఆశ్చర్యపరిచేలా తయారైంది ఈషా రెబ్బా. సరిగ్గా వాడుకుంటే.. అటు మోడ‌ర్న్ గానూ.. ఇటు ట్రెడిషనల్ గానూ... రెండు విధాలా ఉపయోగపడతానని చెప్పకనే చెబుతోంది. మరి ఈ సందేశం నిర్మాతలకు చేరుతుందా.. చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: