నేచురల్‌ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన 'ఆహా కళ్యాణం' సినిమాతో టాలీవుడ్‌ ప్రేక్షకులను ఆకట్టుకున్న హాట్ బ్యూటీ వాణీ కపూర్‌. మన తెలుగు జనాలకు ఈ బ్యూటి అంతగా కనెక్ట్ అవకపోయినా బాలీవుడ్ లో మాత్రం ఈ హాటీ కి విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు. వరుసగా బ్లాక్ బస్టర్ సినిమాలు చేయకపోయినా హాట్ హాట్ ఫోటోషూట్‌లతో ఎప్పుడు వార్తల్లో నలుగుతుంటుంది వాణీ. ఈ అందాల భామ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆరేళ్లు అవుతున్న చేసింది మాత్రం కేవలం నాలుగ సినిమాలే.  అయితే వాణీ మాత్రం తన కెరీర్‌ పట్ల సంతృప్తిగానే ఉన్నట్టుగా ఫీలవుతోంది. మీ ఆలోచనలో అభద్రత భావం ఉన్నపుడే మీరు భయాందోళనకు గురవుతారు. నాకు అలాంటి ఆలోచన ఎప్పుడూ లేదు అంటోంది ఈ హాట్ బ్యూటీ.

మన ప్రయాణంలో మంచి రోజులు, చెడ్డ రోజులు ఉంటాయి. కానీ వాటిని పట్టించుకోకుండా మన వంద శాతం ప్రయత్నిస్తే సక్సెస్ వచ్చి మన ఒడిలో పడుతుంది అంటూ ఫిలాసఫర్ లా మాట్లాడుతోంది. 2013లో రొమాంటిక్‌ కామెడీగా తెరకెక్కిన 'శుద్ద్‌ దేశీ రొమాన్స్‌' సినిమాతో బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది వాణీ. తరువాత 'బేఫిక్రే' లో పిచ్చ గ్లామరస్ గా, రొమాంటిక్ సీన్స్ రెచ్చిపోయి స్కిన్ షో చేసి బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక రీసెంట్‌గా హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా నటించిన 'వార్‌' సినిమాలో మరోసారి ఆకట్టుకుంది.

అయితే పెద్దగా సినిమా అవకాశాలు లేకపోయినా తన కెరీర్ మాత్రం హ్యాపీగా ఉందంటుంది వాణీ. `ప్రతీ నటి మంచి పాత్రల్లో కనిపించాలని ఆశిస్తుంది. నేను కూడా అలాంటి పాత్రలనే ఎంచుకుంటున్నాను. ఇప్పటి వరకు నేనే చేసిన పాత్రల పట్ట ఆనందంగా ఉన్నాను అంటూ తన కెరీర్‌ను విశ్లేషిస్తుంది వాణీ. అంతేకాదు తనకు అన్ని జానర్‌ల సినిమాల్లో నటించాలనుందన్న వాణీ మంచి పాత్రల కోసం ఎదురుచూస్తున్నానంటోంది.యితే సినిమాల పరంగా కాస్త వెనకపడినా హాట్ హాట్‌ ఫోటో షూట్‌లతో నెటిజన్స్ ని తనవైపు లాగేసుకుంటుంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: