ఆమె ఓ తెలుగు సీనియర్ హీరోయిన్.. ఇప్పుడు పెద్దగా సినిమాల్లేవు.. కానీ ఫిట్ నెస్ లో అందంలో కుర్ర హీరోయిన్లకు ఏమాత్రం తగ్గడం లేదు. పెళ్లి కూడా చేసుకున్న ఈ హీరోయిన్ ఎవర్ గ్రీన్ అందాలు ఇంకా కుర్రాళ్లను కట్టిపడేస్తున్నాయి. ఈ అమ్మడు అందాల ఆరబోతలో ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా ఆమె ఓ స్విమ్మింగ్ పూల్లో స్విమ్ సూట్లో అందాలు ఆరబోసింది. ఫోటోలో చూస్తే ఫ్యాన్స్ సరిగ్గా సంతృప్తి చెందుతారో లేదో అనుకుందో ఏమో ఏకంగా వీడియో పోస్టు చేసింది.


ఆ అందాల ప్రదర్శన ముగియక ముందే.. ఈసారి అదిరే డ్రస్సులతో ఫోటో షూట్ పిక్స్ షేర్ చేసింది. ఏమాత్రం గ్లామర్ తగ్గని శ్రీయ.. కొత్త హీరోయిన్లకు పోటీగా వస్తోంది. ఇక ఈ సీనియర్ హీరోయిన్ శ్రీయ శరణ్ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ అయింది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోలు, వీడియోలతో నెటిజన్లకు పండుగ చేస్తోంది.


'ఇష్టం' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన .. మొదటి సినిమాతోనే అందరికీ ఇష్టమైన హీరోయిన్‌గా మారింది. కొన్నేళ్లుగా టాలీవుడ్ తెరపై ఓ వెలుగు వెలిగింది. రెండు తరాల అగ్ర హీరోలతో తెలుగులో రెండు తరాల అగ్ర హీరోలతో ఆడిపాడిన కొద్ది మందిలో శ్రీయ ఒకరు. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేశ్‌ల సరసన నటించి మెప్పించిన శ్రీయ.. వారితో కాంబినేషన్ లో సూపర్ డూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది.


ఇక ఇప్పటి తరం విషయానికి వస్తే.. మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతోనూ నటించింది. ఇక తమిళ సూపర్ స్టార్. రజినీకాంత్ సరసన శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘శివాజీ' మూవీలో హీరోయిన్‌గా నటించి మాంచి హిట్ సాధించింది. ఆ మధ్య ‘మనం’ సినిమాలో .. ఆ తర్వాత బాలయ్య సరసన గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమాలోనూ ఆకట్టుకుంది. పెళ్లి తర్వాత కాస్త జోరు తగ్గిన శ్రియా సోషల్ మీడియాలో మాత్రం అప్ టు డేట్ ఉంటోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: