తెలుగింటి ఆడపడుచు.. బుల్లితెర యాంకర్ శ్యామల అంటే తెలియని వాళ్ళు ఉండరేమో..సోయగాలొలికించే అందం.. తేనే పలుకుల్లాంటి మాటలు.. ఎవరినైనా యిట్టె కట్టిపడేసే చిరునవ్వు ఈమె సొంతం అని వేరేలా చెప్పనక్కర్లేదు. అందుకే శ్యామల చేత ఏదైనా ఫంక్షన్ చేయిస్తే మంచిదని చాలా మంది అనుకుంటారు. ఆమె వాక్ చాటైర్యం తో ఆ సినిమా పై పాజిటివ్ టాక్ ను తీసుకొచ్చి సినిమాను హిట్ అయ్యేలా చేస్తుందని వారి నమ్మకం..  


ఇకపోతే ఈ అమ్మడుకి హీరోయిన్ గా చేయాలంటే అసలు ఇష్టముండేది కాదంటుంది.. కాగా ఆమె హీరోయిన్ కావాలని కోరుకునే ఫ్యాన్స్‌కి క్లారిటీ ఇచ్చింది. ఓ యూట్యూబ్ ఛానల్‌తో మాట్లాడుతూ.. ‘నేను సక్సెస్‌ను రుచి చూస్తూనే ఉన్నా. ఇంకా పూర్తి కాలేదు. ఓ మధ్య తరగతి నుండి వచ్చిన నన్ను ఇంత మంది ఫ్యాన్స్ ఉండటం..ఆనందంగా ఉందంటూ ఆమె వెల్లడించింది.. 


 హీరోయిన్ కావాలంటే చాలా రెస్పాన్సిబులిటీ ఉండాలి. గ్లామర్ షోని ఎక్స్‌పర్ట్ చేస్తారు. దాన్ని నేను మెయిన్‌టైన్ చేయలేను. హీరోయిన్‌ని చూడగానే భలే ఉందిరా అనేట్టుగా ఉండాలి. నేను అందంగా ఉన్నా.. నాకు తిండి, నిద్ర మస్ట్‌గా ఉండాలి.ఈ రెండింటినీ త్యాగం చేయాలి. అది నా వల్ల కాదు. అంతే కాకుండా ఫస్ట్ నాకు హీరోయిన్ కావాలనే ఇంట్రస్ట్ లేదు. ఫ్యూచర్‌లో హీరోయిన్ అవకాశం ఇచ్చినా చేయను. ఓన్లీ క్యారెక్టర్స్. చేస్తే చాలు అంటూ స్యము వెల్లడించింది. 


సీరియల్స్ లో బాగా కష్టపడాలి అప్పుడే ఆ సీరియల్స్ హిట్ అవుతాయి. అయితే శ్యామల మాత్రం సీరియల్స్ సినిమాలలో నటించింది. గుండెల్లో గోదారి, లౌఖ్యం, బెంగాల్ టైగర్, ఒక లైలా కోసం చిత్రాల్లో మంచి పాత్రలే చేశా. యాంకర్‌గా 8 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా చాలా నేర్చుకున్నా. నా అవసరం ఉందనుకుంటే జనాలు మనల్ని కోరుకుంటారని తెలిసింది’ అంటూ చెప్పుకొచ్చింది యాంకర్ శ్యామల... ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: