కోలీవుడ్ హీరో కార్తి తెలుగు ఆడియెన్స్ కు సుపరిచితుడే. రీసెంట్ గా కార్తి హీరోగా లోకేష్ కనగరాజ్ డైరక్షన్ లో వచ్చిన సినిమా ఖైది. మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ టైటిల్ తో వచ్చిన ఈ సినిమా అదిరిపోయే హిట్ అందుకుంది. కొన్నళ్లుగా కోలీవుడ్ సినిమా తెలుగు బాక్సాఫీస్ పై బొక్క బోర్లా పడుతుండగా కార్తి ఖైది మాత్రం విజయ పతాకం ఎగురవేసింది.


ఖైది తెలుగు వర్షన్ ను కె.కె.రాధామోహన్ రిలీజ్ చేశారు. ఈ సినిమాను 5 కోట్లకు కొని రిలీజ్ చేయగా తెలుగులో 21 రోజుల్లో 8.20 కోట్లు వసూళు చేసింది. ఇది కేవలం తెలుగు వర్షన్ కు వచ్చిన కలక్షన్స్ మాత్రమే వరల్డ్ వైడ్ గా కార్తి ఖైది సినిమా 52 కోట్ల షేర్ సాధించినట్టు తెలుస్తుంది. ఈ సినిమా వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ 28.3 కోట్లకు ఇచ్చారు.


అంటే ఎలా లేదన్నా ఫుల్ రన్ లో దాదాపుగా డబుల్ వసూళు చేసినట్టే. కార్తి ఖైదితో డిస్ట్రిబ్యూటర్స్ కూడా హ్యాపీగా ఉన్నారు. సినిమాకు లాభాలు రావడంతో తెలుగు, తమిళ భాషల్లో కార్తి క్రేజ్ మరింత పెరిగింది. ఈ సినిమాకు పోటీగా విజయ్ బిగిల్ కూడా రిలీజైంది. అయితే తెలుగులో కార్తి ఖైదినే హిట్ అయ్యి విజయ్ విజిల్ ఫ్లాప్ అయ్యింది.


అయితే తమిళంలో బిగిల్ సినిమా కూడా సూపర్ హిట్ గా నిలవగా పోటీలో నిలబడి కార్తి ఖైది కూడా సెన్సేషనల్ హిట్ సాధించింది. కోలీవుడ్ తో పాటుగా టాలీవుడ్ లో కూడా మరో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న కార్తి లేటెస్ట్ గా దొంగ సినిమాతో వస్తున్నాడు. ఈ సినిమాలో జ్యోతిక కూడా నటిస్తుంది. సినిమాలో జ్యోతిక తమ్ముడి పాత్రలో కార్తి నటించాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: