నిన్న అక్కినేని నాగేశ్వరావు జాతీయ పురస్కార వేడుకకు సంబంధించిన ఫంక్షన్ లో కొద్దిసేపు నాగార్జున రేఖల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. నాగ్ కొన్ని చిలిపి ప్రశంలు వేస్తూ రేఖ నుండి సమాధానాలు రాబట్టడానికి తన వంతు ప్రయత్నాలు చేసాడు. 

ఇదే సందర్భంలో 70 సంవత్సరాలు దాటిపోయినా వన్నె తగ్గని రేఖ అందం గురించి నాగార్జున మాట్లాడుతూ తనకు రేఖతో నటించాలని ఉంది అంటూ తన కోరికను బయట పెట్టాడు. ఈ మాటలకు వెంటనే స్పందిస్తూ రేఖ తాను ఈ ఫంక్షన్ నుంచి వెళ్ళిపోనా అంటూ జోక్ చేయడమే కాకుండా నాగార్జునకు అమ్ముమ్మ పాత్రలో నటించడానికి తనకు అభ్యంతరం లేదు అంటూ జోక్ చేసింది.

ఈ మాటలకు నాగ్ షాక్ అవ్వడంతో రేఖ నుండి మైక్ తీసుకున్న చిరంజీవి మరో జోక్ చేసాడు. నాగార్జున ఏదైనా సినిమాలో తాత మనవడుగా ద్విపాత్రాభినయం చేసి నటిస్తే తాత పాత్ర చేసే నాగార్జునకు భార్యగా నటించడానికి తనకు అభ్యంతరం లేదు అంటూ రేఖ తన గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అంటూ చిరంజీవి రేఖ సెటైర్ కు తన జోక్ తో సద్దుబాటు చేసాడు. 

ఇదే సందర్భంలో రేఖ అక్కినేని నాగేశ్వరావు గురించి మాట్లాడుతూ తాను అక్కినేని నటించిన ‘సువర్ణ సుందరి’ ని వంద సార్లు చూసిన విషయాన్ని భయటపెట్టి అందర్నీ ఆశ్చర్య పరిచింది. ఒకసారి అక్కినేని తన ఇంటికి పిలిచి కడుపులోకి ఏమి పంపుతున్నాం బుర్రలోకి ఏమి ఎక్కిస్తున్నాం అన్న విషయాల పై నియంత్రణ లేకుంటే జీవితంలో రాణించడం కష్టం అని చెప్పిన మాటలు తాను జీవితాంతం గుర్తుంచుకున్న విషయాన్ని బయట పెట్టింది. తెలుగులో ఒక సినిమా చేయాలి అన్న కోరిక తనకు ఉంది అన్న విషయాన్ని వివరిస్తూ రేఖ అన్నీ కుదిరితే తాను ఒక సినిమాను చేయడానికి సిద్ధం అన్న సంకేతాన్ని ఇస్తూ తన ప్రసంగాన్ని ముగించింది..  



మరింత సమాచారం తెలుసుకోండి: