గత కొంత కాలంగా రేణు దేశాయ్ ఫిలిం రీ ఎంట్రీ గురించి అనేక వార్తలు వస్తున్నాయి. ఆమధ్య బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించే స్టువర్ట్ పురం గజదొంగ టైగర్ నాగేశ్వర రావు జీవితం ఆధారంగా తీయబోయే బయోపిక్ లో కీలక పాత్రకు ఆమె ఎంపిక అయింది అంటూ వార్తలు వచ్చాయి. 

ఈ మూవీకి మాటలు రాస్తున్న బుర్రా సాయి మాధవ్ కూడ ఈ విషయానికి సంబంధించిన లీకులు ఇవ్వడంతో ఈ వార్తలు నిజం అనుకున్నారు అంతా. అయితే రేణు దేశాయ్ నటించబోతున్న పాత్ర స్వభావం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ ఇలాంటి ప్రాధాన్యత లేని పాత్రలు చేయవద్దని తన ప్రతిభకు తగ్గట్టుగా ఒక వెబ్ సిరీస్ ను నిర్మించమని పవన్ అకీరా వద్ద అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. 

దీనితో తాత్కాలికంగా రేణు దేశాయ్ ఫిలిం రీ ఎంట్రీ ఆగిపోయినట్లే అని అంటున్నారు. ఇది ఇలా ఉండగా రైతుల సమస్యల పై వ్రాసిన ఒక కథను తానే స్వయంగా నిర్మించే ఆలోచనలు చేస్తున్నా ఆమెకు సపోర్ట్ ఇచ్చే నిర్మాత ప్రస్తుతానికి దొరకలేదు అన్న ప్రచారం జరుగుతోంది. 

పూణే నుండే హైదరాబాద్ కు షిఫ్ట్ అయిన తరువాత అకీరా ఆద్యలను హైదరాబాద్ లో ఒక ప్రముఖ అంతర్జాతీయ స్కూల్ లో వారిద్దరికీ చదువు చెప్పిస్తు వారి బాగోగులను చూసుకుంటున్న రేణు అకీరాకు డిగ్రీ పూర్తి కాకుండా ఫిలిం ఎంట్రీకి సంబంధించిన ఎటువంటి ఆలోచనలను చేయకూడదని స్పష్టమైన నిర్ణయంలో ఉన్నట్లు టాక్. ప్రస్తుతం ఈమె ‘ఢి’ రియాలిటీ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్నప్పటికీ ఆ షో వల్ల ఆమెకు అదనంగా వస్తున్న క్రేజ్ కనిపించడం లేదు. దీనికితోడు ఆమె నిర్మాతగా దర్శకురాలుగా రాణించాలని చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ముందుకు సాగక పోవడంతో తన ఆలోచనలకు సపోర్ట్ ఇచ్చే వ్యక్తుల కోసం అన్వేషణలో ఉంది రేణు..  


మరింత సమాచారం తెలుసుకోండి: