గత కొంత కాలంగా సినీ రంగంలో కాస్టింగ్ కౌచ్, మీ టూ ఉద్యమాలు తెరపైకి వచ్చాయి.  నటి శ్రీరెడ్డి టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్  జరుగుతుందని..పడక గదిలోకి వస్తేనే సినిమా ఛాన్సులు ఇస్తున్నారని..ఇందులో ఎంతో మంది దళారులు మాత్రమే కాదు సినీ పెద్దలు కూడా ఉన్నారని..ఎంతో మంది అమాయక ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆరోపించింది. అంతే కాదు పెద్ద ఎత్తున ఉద్యమం కూడా చేసింది. కానీ ఆమె ఉద్యమం తారాస్థాయికి చేరుకునే లోపే తన నోటి దురుసుతో అందరికీ వ్యతిరేకం అయ్యింది. ప్రస్తుతం చెన్నైలో ఉంటున్న శ్రీరెడ్డి పలువురు సెలబ్రెటీలపై కామెంట్స్ చేస్తూ వస్తుంది. 

ఇక బాలీవుడ్ లో తనూ శ్రీ దత్తా సైతం గతంలో ప్రముఖ నటులు నానా పటేకర్ తనపై లైంగికంగా వేధించారని సంచలన ఆరోపణలు చేసింది.  తాజాగా ర్శక నిర్మాతల పడకగదికి వస్తే కానీ ఇక్కడ అవకాశాలు అంత ఈజీగా రావని.. వాళ్ల కోరిక తీరిస్తే కానీ తమ టాలెంట్ వాళ్లకు కనిపించదని సంచలన వ్యాఖ్యలు చేసింది నటి మాధవిలత.  గతంలో కాస్టింగ్ కౌచ్ ఉద్యమం జరుగుతున్న సమయంలో మాధవీ లత ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ లో సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.  చాలా కాలం తర్వాత మరోసారి తెరపైకి వచ్చింది ఈ అమ్మడు.

తాను తెలుగమ్మాయి కావడంతో మాధవికి ఇక్కడ పెద్దగా అవకాశాలు రాలేదని కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి తన కామెంట్స్ తో తెరపైకి వచ్చింది. కమిట్మెంట్ అంటే ఇప్పుడు పడుకోవడం అనే అర్థానికి దిగజార్చారని చెబుతుంది మాధవిలత. జానికి కమిట్మెంట్ అంటే ఒప్పుకున్న సినిమా పూర్తి చేయడం అని అర్థం. కానీ ఇప్పుడు మన దర్శక నిర్మాతలు మాత్రం కమిట్మెంట్ అంటే పడుకోవడానికి వస్తావా అన్నట్లు మార్చేసారంటు ఆవేదన వ్యక్తం చేసింది మాధవీ లత. అప్పట్లో తనను కూడా కమిట్మెంట్ అడిగారని చెప్పింది మాధవిలత...కానీ వారి దురాలోచన గమనించి నేను నో చెప్పానని అన్నారు మాధవీలత.  


మరింత సమాచారం తెలుసుకోండి: