అక్కినేని వంశంలోనే ఆ పవర్ ఉంది. హీరోలంతా ఎంత వయసు వచ్చినా కూడా యంగ్ అండ్ ఎనర్జిటిక్ గా కనిపిస్తారు. ఇదిలా ఉండగా నాగార్జున వయసు ఇప్పటికి అరవయ్యేళ్ళు. అయితే నాగ్ అలా కనబడడు. ఆయన ఎప్పటికీ ముప్పయిలాగానే అలరిస్తాడు. ఆయన్ని టాలీవుడ్ మన్మధుడు అంటారందుకే. ఇదిలా ఉండగా నాగ్ ఇంకా కొత్త మూవీస్ చేస్తున్నారు. కొత్త హీరోయిన్ల పక్కన నటిస్తున్నారు.


ఈ నేపధ్యంలో సీనియర్ మోస్ట్ హీరోయిన్ రేఖ నాగార్జునతో నటించాలని మెగాస్టార్ చిరంజీవి ప్రతిపాదించడం విశేషం. రేఖ వయసు ఇప్పటికి 65 ఏళ్ళు. అయినా కూడా ఆమే  ఎక్కడా బ్యూటీ చెక్కుచెదరకుండా ఉండడంతో అక్కినేని అవార్డుల ఫంక్షన్లో చిరంజీవి ఒక ప్రతిపాదన సరదాగా చేశారు.



ఈ వయసులో బ్యూటీగా  ఉన్న రేఖ అక్కినేని నాగార్జున పక్కన హీరోయిన్గా నటించాలన్నది ఆ ప్రతిపాదన. నాగార్జున తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తారు. తండ్రి పాత్ర పక్కన రేఖ హీరోయిన్ అయీతే బాగుంటుంది, ఆ లుక్కే వేరుగా ఉంటుందని చిరు ప్రపోజల్ చేయడం విశేషం. మరి రేఖ ఈ ప్రతిపాదనకు అంగీకరిస్తే మాత్రం ఎవ‌ర్ గ్రీన్ బ్యూటీ రేఖ తెలుగులో మరో మారు అరంగేట్రం చేయడం ఖాయం. 


ఇదిలా ఉండగా నాగార్జున మాట్లాడుతూ తాను అందాల నటి శ్రీదేవితో ఇప్పటికి నాలుగు సినిమాలు చేశానని చెప్పారు. అయితే అందాల రేఖ పక్కన నటించే అవకాశం మాత్రం తనకు ఇప్పటివరకూ రాలేదని అన్నారు. దానికి రేఖ బదులిస్తూ తాబు  గ్రాండ్ మదర్ గా నటిస్తే బాగుంటుందేమో అన్నారు. ఇక చిరంజీవి అందుకుని మీ అందానికి ఏం తక్కువ నాగ్ పక్కన హీరోయిన్ గానే చేసేయండి అంటూ కొత్త ప్రపోజల్ పెట్టేసాడు. చూడాలి ఇక ఎలా ఉంటుందో




మరింత సమాచారం తెలుసుకోండి: