టాలీవుడ్ లో స్టార్ పొజీషన్ లో ఉన్న హీరో మెగాస్టార్ చిరంజీవి. పునాధిరాళ్లు సినిమాతో ఆయన సినీ పరిశ్రమలో పునాధి వేసి అంచెలంచెలుగా స్వయంకృషితో పైకి ఎదిగి మెగాస్టార్ అయ్యారు.  ప్రస్తుతం ఆయన వారసులుగా టాలీవుడ్ లో హీరోలుగా కొసాగుతున్నారు. తాజాగా హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో ఏఎన్నార్ జాతీయ అవార్డుల కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు బయటి వ్యక్తులకు తెలియని ఓ విషయాన్ని గురించి ప్రస్తావించారు.

తన తల్లి అంజనాదేవి గర్భంతో ఉండగా జరిగిన మధురమైన సంఘటనని చిరంజీవి వివరించారు.  అది 1955వ సంవత్సరం.. పచ్చని పళ్లె వాతావరణంలో పెళ్లి చేసుకుని ఓ కొత్తజంట జీవితాన్ని ప్రారంభించారు.  ఆమె గర్భం దాల్చింది.. త్వరలో కాన్పు జరగబోతోంది. అయితే ఆమె అక్కినేని నాగేశ్వరరావు కి వీరాభిమాని.  అంతలోనే ఆమె ఎంతగానో అభిమానించే హీరో సినిమా రిలీజ్ అయ్యింది.  కాన్పు తర్వాత బయటకు వెళ్లే అవకాశం ఉండదు. నా అభిమాన నటుడి సినిమా విడుదలయింది చూడాలి అనే కోరికని తన భర్తకు చెప్పుకుంది.  పక్కనే ఉన్న టౌన్ కు వెళ్లాలంటే ఆరు కిలోమీటర్లు ప్రయాణించాలి.

ఓ నిండు గర్భవతికి అది చాలా ప్రమాదంతో కూడిన ప్రయాణం. అయినా భార్య కోరిక కాదనలేక ఆ భర్త ఓ జట్కా బండి ఏర్పాటు చేశాడు. అప్పట్లో సరైన రహదారులు లేవన్న విషయం తెలిసందే. మార్గమధ్యంలో వారు ఎక్కిన గుర్రపుబండి ప్రమాదానికి గురై పక్కకి ఒరిగిపోయి పడిపోయింది. భార్య కూడా కిందపడిపోవడంతో భర్త తీవ్ర ఆందోళనకు గురయ్యాడు.  నిండు గర్భిణివి..ఇలాంటి సమయంలో రిస్క్ తీసుకోవడం ఎందుకు..వెనక్కి వెళ్లిపోదామని భార్యతో ఆ భర్త అన్నారు. కానీ భార్య వినిపించుకోకుండా సినిమాకు వెళ్లాల్సిందేనని పట్టుబట్టింది. దాంతో అలాగే ముందుకెళ్లి సినిమా చూసి వచ్చారు. 

సినిమా చూసి వచ్చాక ఆమె ముఖంలో సంతోషం చూసి ఆనందించారు ఆ భర్త. ఆనాడు గర్భంతో ఉన్న ఆవిడ ఎవరో కాదు మా అమ్మ అంజనాదేవి.  భార్య కోరిక తీర్చిన ఆ వ్యక్తి మా నాన్న వెంకట్రావు. ఆ రోజు ఇద్దరూ చూసిన సినిమా ‘రోజులు మారాయి'.  ఆ మూవీలో అక్కినేని నాగేశ్వరరావు హీరో. ఇంతకీ ఆమె కడుపులో ఉన్నది ఎవరో కాదు నేనే.. అంటూ సభికులను ఆశ్చర్యంలో ముంచెత్తారు.


మరింత సమాచారం తెలుసుకోండి: