ఒక దశలో టాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ లో ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం ఇబ్బందులను ఎదుర్కొంటోంది. పూజ హెగ్డే, రష్మీక మందన నుంచి టఫ్ కాంపిటీషన్ కు తోడు వరుస ప్లాఫ్స్ వెంటాడుతూ రకుల్ కెరీర్ కు బ్రేకులు వేస్తున్నాయి. గ్లామర్, అందం, నటన పుష్కలంగా ఉన్నా ప్రస్తుతం అవకాశాలు సన్నగిల్లాయి. మొదటి సినిమా నుంచి ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయిన రకుల్ క్రేజీ ఆఫర్లనే పట్టింది. పెద్ద హీరోల సినిమాలతో రేసులో దూసుకెళ్లింది.




మహేశ్ తో చేసిన స్పైడర్, రామ్ చరణ్ తో బ్రూస్ లీ, జయ జనాకీ రామ, నాగార్జున తో మన్మధుడు.. ఇలా తన కెరీర్ కు బ్రేకులు వేసాయి. అడపాదడపా హిట్స్ వచ్చినా అవేమీ ఆమెకు అవకాశాలను, క్రేజ్ ను తెచ్చిపెట్టలేకపోయాయి. అయితే.. రకుల్ కు ఉన్న మరో అవకాశం బాలీవుడ్. నార్త్ కే చెందిన ఈ బ్యూటీ బాలీవుడ్ లో కూడా ఫేమస్. అప్పుడప్పుడూ హిందీ సినిమాల్లో కూడా నటిస్తూంటుంది. ఆమధ్య అజయ్ దేవ్ గన్ తో నటించిన దే దే ప్యార్ దే సినిమా కోసం స్లిమ్ గా తయారై గ్లామర్ ఒలకబోసినా ఆ సినిమా ఫలితంతో రకుల్ నిరాశకు గురైంది. రీసెంట్ గా మార్జవాన్ లో వేశ్య పాత్రలో నటించి సెక్సీగా కనిపించింది. సినిమా ప్రమోషన్ కూడా ఆమె పాటతో మొదలుపెట్టారు. కానీ.. సినిమా రిలీజ్ అయి అట్టర్ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. 




ఫిట్ గా ఉన్నా, అందం ఒలకబోసినా రకుల్ కు హిట్లు రావట్లేదు. దీంతో టాలీవుడ్ లో అమ్మడిని పట్టించుకునే నిర్మాతలే కరువవుతున్నారు. ఒక్క హిట్ వచ్చినా అవకాశాలు అందిపుచ్చుకునే సత్తా ఉన్న రకుల్ కు ఆ అవకాశమే కరువవుతోంది. ప్రస్తుతం భారతీయుడు2 లో నటిస్తోంది రకుల్.


మరింత సమాచారం తెలుసుకోండి: