‘నచ్చావులే’ మూవీతో టాలీవుడ్ ఫిలిం ఎంట్రీ ఇచ్చిన మాధవీలత ఆ తరువాత నానితో కలిసి ‘స్నేహితుడా’ మూవీలో నటించింది. ఆ తరువాత కొన్ని సినిమాలలో ఆమె నటించినా ఆమెకు గుర్తింపు రాకపోవడంతో ఆమెకు అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. 

అయినప్పటికీ ఆమె అనేక వివాదాస్పద విషయాలలో కామెంట్స్ చేస్తూ మీడియాకు ఎప్పుడు హాట్ టాపిక్ గా మారుతూ ఉంటుంది. పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అయిన మాధవీలత ఈ మధ్య జరిగిన ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయింది. 

ఈమధ్య ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇండస్ట్రీలో ప్రస్తుతం నడుస్తున్న కమిట్మెంట్ అన్న పదం వెనుక ఉన్న అర్ధాలను వివరించింది. ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన అమ్మాయిలు తమకు ఇలాంటి పదం తమకు అవకాశాలు ఇస్తున్న దర్శక నిర్మాతల నుండి ఎదురైనప్పుడు కమిట్మెంట్ అంటే తమ పాత్రను శ్రద్ధగా కష్టపడి నటించడం అనుకుంటారనీ దాని వెనుక అర్ధాలు వేరు అంటూ అసలు విషయాన్ని బయట పెట్టింది. 

వాస్తవానికి ప్రస్తుతం ఇండస్ట్రీలో కమిట్మెంట్ అంటే ‘పడుకోవడానికి వస్తావా అన్నట్లు వ్యవహరిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు’ చేసింది. కమిట్‌మెంట్ అనేది చాలా పవిత్రమైన పదమని కానీ దాని అర్ధాన్ని మార్చివేసి చాలామంది దర్శక నిర్మాతలు ఇండస్ట్రీలోకి వస్తున్న అనేకమంది జీవితాలను నాశనం చేస్తున్న విషయాలను బయటపెట్టింది. తాను ఇండస్ట్రీకి వచ్చిన రోజులలో తనకు కూడ ఇటువంటి పదాలు ఎదురయ్యాయని అయితే తాను ఆ పదంలోని అర్ధాలు తెలుసుకుని తాను వెంటనే నో చెప్పడంతో తనకు ఎటువంటి సమస్యలు ఏర్పడలేదనీ అప్పటి విషయాలను ఇప్పుడు బయట పెట్టింది. ప్రస్తుతం ఫిలిం ఇండస్ట్రీలో అమ్మాయిలకు సమర్ధతను చూసి అవకాశాలు వచ్చి పరిస్థితులు లేవు అంటూ మాధవీలత చేసిన కామెంట్స్ ప్రస్తుతం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: