కొందరు హీరోయిన్స్ తమ మీద వచ్చిన రూమర్స్ కు చెక్ పెట్టాలని చూస్తారు. పర్సనల్ విషయాలను షేర్ చేసుకోడానికి ఇష్టపడరు. కాని కొందరు మాత్రం తమ మనసులో ఉన్న ఫీలింగ్స్ ను బయటపెట్టేస్తారు. లేటెస్ట్ గా కన్నడ భామ నిక్కి గర్లాని కూడా తన ప్రేమ విషయాన్ని చెప్పి ఆడియెన్స్ కు షాక్ ఇచ్చింది.  


కన్నడలో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకున్న నిక్కి గర్లాని తెలుగులో కూడా ఒకటి రెండు సినిమాలు చేసింది. అయితే అమ్మడికి ఇక్కడ ఆశించిన స్థాయిలో క్రేజ్ రాలేదు. అందుకే మళ్లీ కన్నడలోనే వరుస సినిమాలు చేస్తుంది. తమిళంలో కూడా నిక్కి గర్లాని మంచి ఆఫర్లు అందుకుంటుంది. కోలీవుడ్ లో వరుస హిట్ సినిమాల్లో నటించిన నిక్కి గర్లాని లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూలో చెన్నైలో ఒక వ్యక్తితో ప్రేమలో పడ్డానని చెప్పింది.


తను లవ్ చేస్తున్న విషయాన్ని దాయడానికి ఇష్టపడని నిక్కి గర్లాని అవును లవ్ చేస్తున్నా.. ప్రస్తుతం ప్రేమలో ఉన్నా అతనికి నేనంటే చాలా ఇష్టం. అయితే పెళ్లి మాత్రం ఇప్పుడు కాదు అంటుంది నిక్కి. ప్రస్తుతం చేతిలో ఆఫర్లు ఉన్నాయని వాటిని పూర్తి చేసి మరో మూడేళ్లు కెరియర్ కొనసాగించి ఆ తర్వాత పెళ్లి చేసుకుంటా అంటుంది ఈ కన్నడ భామ.


కన్నడ, తమిళ భాషల్లో స్టార్ క్రేజ్ తెచ్చుకున్న నిక్కి గర్లానికి తెలుగులో మాత్రం అంతగా మెప్పించలేకపోయింది. అయితే అవకాశం వస్తే తెలుగు సినిమాల్లో కూడా నటించేందుకు సిద్ధమని అంటుంది అమ్మడు. ప్రస్తుతం కెరియర్ చాలా సాఫీగా సాగుతుందని.. కమర్షియల్ సినిమాలే కాదు ప్రయోగాత్మక సినిమాల్లో కూడా తాను నటించేందుకు సిద్ధమని అంటుంది నిక్కి గర్లాని. ప్రేమిస్తున్న విషయం చెప్పింది కాని అతని వివరాలు ఏవి రివీల్ చేయలేదు. మరి నిక్కి మనసు దోచిన ఆ లక్కీ గాయ్ ఎవరో ఆమె చెప్పేదాకా వెయిట్ చేయాల్సిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: