వెంకీమామకు ప్రేమ ముల్లు గుచ్చుకుంది. పెళ్లీడు దాటి 20ఏళ్లవుతున్న టైమ్ లో ఈ బ్యాచిలర్ లవర్ కు దొరికేసింది. పిల్లలు ఏబీసీడీలు నేర్పే పంతులమ్మ., ఈ మామకు పాఠాలు చెప్తోంది. లేటు వయసులో వెంకీమామ నేర్చుకుంటున్న ఆ పాఠాలు తమన్ చెవిన పడ్డాయి. ఇక వెంటనే ఆ పాఠాలకు ట్యూన్ కట్టి, ఓ ప్రేమ పాటని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. 


లవ్ బీట్స్ తో టాలీవుడ్ ని ప్రేమలో పడేస్తున్న తమన్ వెంకీమామకు ఓ ప్రేమగీతం అందించాడు. వెంకటేష్ కామెడీ టైమింగ్ ని రిఫ్లెక్ట్ చేస్తూ ఓ రెట్రో బీట్ ని కంపోజ్ చేశాడు. ఎన్నాళ్లకో.. ఎన్నేళ్లకో.. ఒంటికాయ సొంటికొమ్ము సెంటు కొట్టెరో అంటూ ఓ ఫన్నీ లవ్ సాంగ్ ఇచ్చాడు. శనివారం తమన్ బర్త్ డే సందర్భంగా నిర్మాతలు ఈ పాటని రిలీజ్ చేశారు. 


వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా రూపొందుతోంది వెంకీమామ. ఈ మూవీలో వెంకీతో పాయల్ జోడీ కడితే, నాగచైతన్యతో రాశీఖన్నా రొమాన్స్ చేస్తోంది. జై జవాన్ జై కిసాన్ నినాదాన్ని కథగా తెరకెక్కిస్తున్నాడు బాబీ. వెంకీ రైతు పాత్రలో కనిపిస్తే.. చైతన్య బార్డర్ దగ్గర కాపలాకాస్తాడని చెబుతున్నారు. 


వెంకీమామ నుంచి ఇప్పటికే వచ్చిన టీజర్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ రావడంతో యూనిట్ చాలా హ్యాపీగా ఉంది. ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ అయ్యిందనీ.. ఈ పాజిటివ్ రెస్పాన్స్ తో సినిమాకు మంచి ఓపెనింగ్స్ వస్తాయని నమ్ముతోంది. ఈ నమ్మకంతోనే వెంకటేశ్ బర్త్ డే సందర్భంగా.. ఈ చిత్రాన్ని డిసెంబర్ 13న రిలీజ్ చేయాలనుకుంటున్నాట నిర్మాతలు. చూడాలి మరి.. ఇద్దరు స్టార్ హీరోస్ ఒకే సినిమాలో కనిపించనుండటంతో అభిమానుల ఆనందాలకు అవధుల్లేవు. ఇటు అక్కినేని ఫ్యాన్స్, అటు వెంకటేశ్ ఫ్యాన్స్ కు పండుగే పండుగ.   


మరింత సమాచారం తెలుసుకోండి: