అన్ని విషయాల్లో ముందుండే బాలయ్య ఈ సారి వెనుకపడిపోయాడు. ఆయన కెరీర్ కు ఉన్నంత వయసు కూడా లేని యంగ్ హీరోలు దూసుకుపోతుంటే... బాలయ్య మాత్రం బాగా స్లో అయిపోయాడు. పోటీ ప్రపంచంలో రేసుగుర్రంలా దూసుకుపోయే బాలకృష్ణకు ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది. 


జై సింహా తర్వాత బాలకృష్ణ మరోసారి కె.యస్ రవికుమార్ దర్శకత్వంలో రూలర్ మూవీ చేస్తున్నాడు. సి.కల్యాణ్ నిర్మాత. సినిమాను సంక్రాంతి రేసులో దించాలనుకున్నాడు నిర్మాత. అయితే కాంపిటీషన్ ఎక్కువగా ఉండటం, థియేటర్స్ కొరత కారణంగా క్రిస్మస్ కు తీసుకొచ్చేశారు. డిసెంబర్ 20న విడుదలంటూ రిలీజ్ డేట్ కూడా ఎనౌన్స్ చేసినా.. ఇప్పటి వరకు టీజర్ కూడా రాలేదు. 


క్రిస్మస్ పండుగకు వస్తున్న సినిమాలన్నీ టీజర్స్ తో.. పాటలతో సందడి చేస్తున్నాయి. రూలర్ తో పాటు వస్తున్న ప్రతీరోజూ పండుగే టీజర్ తో పాటు రోజుకో సాంగ్ తో పాటల పండుగ చేసుకుంటోంది. సాయి ధరమ్ తేజ్, రాశీఖన్నా జంటగా నటిస్తున్న ఈ చిత్రం మారుతి దర్శకత్వంలో రూపొందుతోంది. ఇంకా ట్రైలర్ రిలీజ్.. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒక్కటే మిగిలుంది. 


డిసెంబర్ 25న రిలీజ్ అవుతున్న రాజ్ తరుణ్ మూవీ ఇద్దరి లోకం ఒక్కటే.. ఆల్ రెడీ ప్రమోషన్ మొదలుపెట్టింది. ఇక సంక్రాంతికి వస్తున్న అల వైకుంఠపురంలో... నందమూరి కల్యాణ్ రామ్ ఎంతమంచి వాడవురా.. మహేశ్ సరిలేరు నీకెవ్వరు ప్రమోషన్ స్టార్ట్ చేసి నెల దాటింది. ఇలా అందరూ దూసుకుపోతున్నా.. బాలకృష్ణ మూవీ రూలర్ కు సంబంధించి స్టిల్స్ మినహా ఒక్కటీ రిలీజ్ కాలేదు. 


రూలర్ ప్రమోషన్ లో వెనుకబడిపోవడంతో.. సినిమా డిసెంబర్ 20న వస్తుందా? అనే డౌట్ అభిమానుల్లో నెలకొంది. రిలీజ్ కు ఇంకా నెల మాత్రమే ఉంది. ఇంతవరకు టీజర్ కూడా రిలీజ్ కాలేదు. పోనీ టీజర్ రిలీజ్ డేట్ కూడా ఎనౌన్స్ చేయలేదు. అయితే.. బాలయ్య గోల్ఫ్ ఆడుతూ ఉన్న స్టిల్ లో డిసెంబర్ 20న రిలీజ్ అని రాసి ఉంది. అప్పుడప్పుడు ఓ స్టిల్ కాకుండా.. టీజర్.. సాంగ్స్ తో ప్రమోషన్ పెంచాలంటున్నారు నందమూరి అభిమానులు.  



మరింత సమాచారం తెలుసుకోండి: