నందమూరి బాలకృష్ణ తన నాన్ సీరియస్ డైలాగులతో తనకంటూ ఒక విభిన్నమైన స్థానాన్ని తెలుగు ప్రేక్షకుల్లో సాధించాడు. ఈ మధ్య వచ్చిన ఎన్టీఆర్ కథానాయకుడు మహానాయకుడు సినిమాలు అంతగా విజయం సాధించలేదు. దాంతో బాలకృష్ణ అభిమానులు ఎంతో నిరాశతో ఉన్నారు. కానీ అతని నెక్స్ట్ సినిమా 'రూలర్' పోస్టులు చూస్తుంటే బాలయ్య ఈసారి భారీ విజయం సాధించేటట్లే అనిపిస్తుంది. . ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన రెండు పోస్టులు విడుదలయ్యి నెట్టింట పెద్ద సంచలనమే సృష్టించాయి. డైరెక్టర్ కేయస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. 


తాజాగా కొంతమంది టిక్ టాక్ యూజర్స్ బాలకృష్ణ చేస్తున్న రూలర్ చిత్ర షూటింగ్లో బాలయ్య ను కలిసి అతనితో సెల్ఫీలు దిగారు. ప్రస్తుతం ఈ ఫొటోస్ సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి. కొంతమంది బాలయ్య లుక్ ని చూసి.. గతంలో చేసిన లక్ష్మీ నరసింహ సినిమాలో లాగానే కనిపిస్తున్నాడని పలు రకాల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. 


ఈ చిత్రంలో బాలయ్య పోలీస్ పాత్రతో పాటు సాఫ్ట్ వేర్ ప్రొఫిషనల్‌గానూ నటిస్తున్నాడని తెలుస్తుంది. ఆ మధ్య విడుదలైన స్టైలిష్ లుక్ కూడా దీనికి సంబంధించిందే. పోలీస్ పాత్రల్లో బాలయ్య చాలా సినిమాలు చేసాడు కానీ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా మాత్రం ఇప్పటి వరకు కనిపించలేదు.


ఈ సినిమాను మినహాయించి జయలలిత బయోపిక్ 'జయ' అనే హిందీ సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ పాత్రను బాలకృష్ణ పోషిస్తున్నారని సమాచారం. అయితే.. ఇందులో నందమూరి తారక రామారావు, జయలలితలకు సంబంధించిన ఆసక్తికరమైన సన్నివేశాలను సినిమాలో చూపించనున్నారట. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ టైటిల్ రోల్ లో నటిస్తున్న 'జయ' బయోపిక్ విషయానికొస్తే తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ బయోపిక్‌ను విడుదల చేయనున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: