పదేళ్ళ పాటు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన అందగత్తె కాజల్ అగర్వాల్. ఈమద్య కాలంలో కాజల్ స్పీడ్ కాస్త తగ్గిందన్న మాట తన ఫ్యాన్సే కాదు...ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిందే. అడపా దడపా స్టార్ హీరోల సినిమాలో ఛాన్స్ లు వచ్చినప్పటికి కాజల్ కెరీర్ దాదాపు ముగిసినట్లే అంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ బ్యూటి ప్రస్తుతం తను నటించిన తమిళ సినిమా 'పారిస్ పారిస్' విడుదల కోసం ఎదురు చూస్తుంది. ఆ సందర్బంగా కాజల్ చేసిన వ్యాఖ్యలు నవ్వు తెప్పిస్తున్నాయంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తుండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

'పారిస్ పారిస్' సినిమా బాలీవుడ్ సూపర్ హిట్ 'క్వీన్' కు అఫీషియల్ రీమేక్ అన్న సంగతి తెల్సిందే. హిందీలో ఎలా అయితే ఉందో తమిళంలో ఉన్నది ఉన్నట్లుగా చేశాం. ఎక్కడ ఎలాంటి మార్పు చేయకున్నా కూడా తమిళ వర్షన్ కు 'ఎ' సర్టిఫికెట్ ఇవ్వడంపై కాజల్ విమర్శలు గుప్పిస్తోంది. సెన్సార్ తీరుపై ఇప్పటికే చాలా సార్లు స్పందించిన కాజల్ మరోసారి మాట్లాడుతూ రాష్ట్రానికి ఒక తీరుగా సెన్సార్ ఉండటం ఏంటీ అంటూ సూటిగా ప్రశ్నించింది. ఒకే సినిమాకు ఇన్ని రకాలుగా సెన్సార్ సర్టిఫికెట్స్ ఇవ్వడంతో కాజల్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమాల వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

ఇకపై తను బోల్డ్ కంటెంట్ పాత్రలు సినిమాలు చేయనే చేయను.. అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలపై నెటిజన్స్ స్పందిస్తూ ప్రస్తుతం నీకు హీరోయిన్ గా ఛాన్స్ రావడమే కష్టంగా ఉంది.. ఇంకా నువ్వు బోల్డ్ కంటెంట్ పాత్రలు చేయనంటూ కామెంట్స్ చేస్తుంటే నవ్వు వస్తుందంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. కాజల్ హీరోయిన్ గా చేసినా.. బోల్డ్ కంటెంట్ చేసినా, నార్మల్ గా నటించినా కూడా కాజల్ కెరీర్ క్లోజేనంటు కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి ఇలాంటి టైం లో కాజల్ కి ఒక భారీ హిట్ పడితే పరిస్థితేంటో..! 


మరింత సమాచారం తెలుసుకోండి: