డిసెంబర్ 31..నైట్ టాలీవుడ్ లో భారీ పండగ వాతావరణాన్ని తీసుకురాబోతోందని లేటెస్ట్ అప్‌డేట్. డిసెంబర్ 31 మిడ్నైట్ టాలీవుడ్ నుంచి భారీ ట్రీట్లు.. మెరుపులు... మెస్మరైజింగ్ అనౌన్స్ మెంట్లు రాబోతున్నాయి. ఈ రోజు కోసమే ఎదురుచూస్తున్న భారీ సినిమాల దర్శక, నిర్మాతలు.. హీరోలు.. అభిమానులకు, ప్రేక్షకులకు పెద్ద ట్రీట్ ఇవ్వబోతున్నారు. ఈ ట్రీట్ కి ఇంకా నెలన్నర మాత్రమే సమయం వుంది. డిసెంబర్ 31న టాలీవుడ్ నుంచి కళ్లు చెదిరే న్యూస్, ట్రైలర్స్, ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్స్, సాంగ్ ప్రోమొస్ రాబోతున్నాయి. 

ఇందులో ప్రధానంగా రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమా నుంచి కొత్త లుక్ పోస్టర్స్ రాబోతున్నాయి. ఈ సినిమా కోసం ఇప్పటి వరకు ఫ్యాన్స్ ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ ని క్రియేట్ చేసి సోషల్ మీడియాలో హంగామా సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమా ఫస్ట్ లుక్ ఎలా వుండబోతోందనే క్యురియాసిటీ అందరిలోనూ మొదలైంది. దీనికి తగ్గట్టే ఆర్.ఆర్.ఆర్ లుక్స్ వుండబోతున్నాయని తెలుస్తోంది. దీనికి తోడు మహేష్ బాబు నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు నుంచి కూడా డిసెంబర్ 31 నైట్ అద్భుతమైన ట్రైలర్ రాబోతోంది.

ఇప్పటికే టీజర్ తో హింట్ ఇచ్చిన అనిల్ రావిపూడి ట్రైలర్ కోసం భారీగానే కసరత్తులు చేస్తున్నారట. ఈ రేసులో అల్లు అర్జున్ అల వైకుంఠపురములో.. సినిమా నుంచి కూడా ఓ ఫెంటాస్టిక్ న్యూస్ రాబోతోంది. ఈ సినిమాలో టబు కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక రజనీకాంత్ దర్బార్ నుంచి కూడా అద్భుతాలు రాబోతున్నాయి. ట్రైలర్, సాంగ్ టీజర్స్ ని రిలీజ్ చేసే అవకాశం వుందని తెలుస్తోంది. నందమూరి హీరో కల్యాణ్ రాం నటిస్తున్న ఫ్యామిలీ మూవీ ఎంత మంచి వాడవురా నుంచి సాఫ్ట్ ప్రోమోస్ రాబోతున్నాయి. దీనితో పాటు మరి కొన్ని కొత్త సినిమాలకు సంబంధించిన ప్రకటనలు విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ ల సినిమా లుక్ కూడా రాబోతోందని తాజా సమాచారం. ఇలా బోలెడు సినిమాల ఫ్రెష్ అప్‌డేట్స్ తో డిసెంబర్ 31 రాత్రి టాలీవుడ్ సెలబ్రిటీస్ హంగామా చేయబోతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: