బాలీవుడ్ లో హాటెస్ట్ కపుల్ గా ప్రతీ రోజు వార్తల్లో నిలుస్తు సెన్షేషన్ ని క్రియోట్ చేస్తున్న జంట అర్జున్ కపూర్- మలైకా అరోరా. గత కొంత కాలంగా డేటింగ్ లో ఉంటూ ముంబై వీధుల్లో చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్నారు. దాంతో ఈ జంట ఎప్పుడెప్పుడు పెళ్లి వార్త చెబుతుందా..! అని బాలీవుడ్ జనాలంతా ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. వాళ్ళ ఎదురుచూపులకు ఫుల్ స్టాప్ పెడుతూ మలైకా.. పెళ్లి ఇప్పట్లో లేదని క్లారిటీ ఇచ్చి షాకిచ్చింది. దాంతో ఈ జంట పెళ్లికి ఇంకాస్త టైం పడుతుందనుకున్న అభిమానులకు ఇంతలోనే మరో ఊహించని ట్విస్టు పడింది.

తాజాగా రకుల్ తో అర్జున్ కపూర్ చాలా క్లోజ్ గా చిలౌట్ మూవ్ మెంట్ లో ఉన్న ఫొటోని షేర్ చేసిన సిస్టర్ జాన్వీకపూర్.. క్యూట్ కపుల్!! అని క్యాప్షన్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. మలైకా అరోరాతో అర్జున్ కపూర్ త్వరలో పెళ్లికి సిద్ధమవుతున్నాడన్న స్పెక్యులేషన్స్ నేపథ్యంలో చెల్లెలు జాన్వీ సోషల్ మీడియా వేదికగా క్యూట్ జోడీ అంటూ కామెంట్ చేయడం ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీంతో మలైకా మీద నెటిజన్స్ విపరీతంగా కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. అర్జున్ కపూర్- రకుల్ ప్రీత్ సింగ్ కలిసి తాజాగా ఒక బాలీవుడ్ సినిమాలో నటిస్తున్నారు. భూషణ్ కుమార్- నిఖిల్ అద్వానీలతో కలిసి ఈ సినిమాని హీరో జాన్ అబ్రహం నిర్మిస్తున్నారు. కాశ్వీనాయర్ డైరెక్టర్ గా బాలీవుడ్ కి పరిచయమవుతున్నారు.

రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ రీసెంట్‌గా మొదలైంది. దీనికి సంబంధించిన స్టిల్స్ ని ఇన్ స్టాలో పోస్ట్ చేసిన అర్జున్ కపూర్ ... సినిమా మొదలైంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాల్ని త్వరలో తెలియజేస్తాం అని రకుల్ తో వున్న క్యూట్ రొమాంటిక్ ఫొటోలని పోస్ట్ చేశాడు. దీనిపై జాన్వీతో పాటు నెటిజన్స్ కూడా జోరుగా కామెంట్స్ చేయడం ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: