టాలీవుడ్ ఫ్యామిలీ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ‘హ్యాపీ డేస్’ మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది తమన్నా. ఈ మూవీలో ఎంతో ట్రెడిషినల్ గా కనిపించి ఈ మిల్క్ బ్యూటీ తర్వాత గ్లామర్ తరహా పాత్రల్లో కనిపించింది.  తెలుగు, తమిళ భాషల్లో వరుస ఛాన్సులు కొట్టేసింది.  కాకపోతే తమన్నాకు చెప్పుకోదగ్గ హిట్స్ మాత్రం రాలేదు. ఇక లాభం లేదని బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది..అక్కడ ఎంతగా ఎక్స్ పోజింగ్ చేసినా సక్సెస్ కాలేకపోయింది. 

రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘బాహుబలి’ లో అవంతిక పాత్రలో అప్సరసలా కనిపించి..తర్వాత పోరాట యోధురాలిగా దుమ్మురేపింది.  ఈ మూవీ బ్లాక్ బస్టర్ తర్వాత బాహుబలి 2 లో కొద్దిపాటి నిడివితో సరిపెట్టుకుంది.  ప్రభుదేవ దర్శకత్వం వహించిన అభినేత్రి, అభినేత్రి 2 లో నటించింది. ఈ సంవత్సరం అనీల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ నటించిన ‘ఎఫ్ 2’ లో హాట్ లుక్, బికీనీ సన్నివేశాల్లో నటించింది.  ఆ మద్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. గ్లామర్ విషయంలో దర్శక నిర్మాతలకు ముందే షరతులు విదిస్తానని చెప్పింది.

అయితే పద్నాగేళ్ల తన కెరీర్ లో ఒక్క లిప్ లాక్ సీన్ లో కూడా నటించలేదని..ఇక నటించబోనని చెప్పింది. తాజాగా తమన్నా ఇప్పుడు మాత్రం మాట మార్చేసినట్లు ఫిలిమ్ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి. ఇప్పటికే విశాల్ ‘యాక్షన్’ సినిమాలో ఆకుపచ్చ బికినీతో పిచ్చెక్కించే సీన్లో నటించింది. తాజాగా లిప్ లాక్ లపై  తమన్నా ఒక షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చింది. 

తన అభిమాన హీరో హృతిక్ తో నటించే అవకాశం వస్తే లిప్ లాక్ సీన్ చేయడానికి ఏ మాత్రం అలోచించనని వెంటనే ఒప్పేసుకుంటానని చెప్పేసింది.  గతంలో బేబీ హిమ్మత్ వాలా అనే బాలీవుడ్ సినిమా చేసినప్పటికీ నార్త్ జనాలు మిల్కి బ్యూటీని పెద్దగా పట్టించుకోలేదు. మరి ఒకవేళ  తనకు ఇష్టమైన హీరోతో లిప్ లాక్ సీన్ చేయడానికి ఏ మాత్రం అడ్డు చెప్పానని చెప్పిన తమన్నా కోరిక ఎంతవరకు నెరవేరుతుందో చూడాలి.
 


మరింత సమాచారం తెలుసుకోండి: