బిగ్ బాస్ సీజన్ 3లో రాహుల్ విన్నర్ కాగా అతని విజయంలో తోడుగా నిలిచింది మాత్రం పునర్నవి భూపాలం అని చెప్పాలి. ఎందుకంటే రాహుల్, పునర్నవిల కెమిస్ట్రీనే సీజన్ కు సూపర్ క్రేజ్ తెచ్చింది. ఈ లవ్ కపుల్ ఇంట్లో చేసిన హంగామా తెలుగు బుల్లితెర ఆడియెన్స్ ను మెప్పించింది. ఇక బిగ్ బాస్ కు ముందు రాహుల్ మంచి సింగర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.


బిగ్ బాస్ విన్నర్ గా రాహుల్ కు మునుపటి కన్నా డబుల్ ట్రిపుల్ క్రేజ్ వచ్చిందని చెప్పొచ్చు. ఇక పునర్నవి అయితే అంతకుముందు కేవలం ఒక హీరోయిన్ గా మాత్రమే తెలుసు. కాని ఓ మహిళగా తను ఎంత స్ట్రాంగ్ అన్నది బిగ్ బాస్ చూస్తే తెలుస్తుంది. ఇలా సింగర్ రాహుల్, హీరోయిన్ పునర్నవిలను కలిపింది బిగ్ బాస్ షో.     


షో నుండి బయటకు వచ్చాక కూడా ఈ ఇద్దరు జంటగా కనిపిస్తూ అలరిస్తున్నారు. రాహుల్, పునర్నవిల జోడీతో సినిమా ప్లానింగ్ కూడా చేస్తున్నారని తెలుస్తుంది. ఇక బిగ్ బాస్ సీజన్ 3 రీయూనియన్ లో అందరు ఇంటి సభ్యులు పాల్గొన్నారు. కాని రాహుల్ మాత్రం మిస్ అయ్యాడు. రాహుల్ మిస్ అవడాన్ని తెలియచేస్తూ ఫ్రెండ్ ఎవర్ ఫ్రెండ్స్ అని వరుణ్, వితికలతో ఉన్న పిక్ షేర్ చేసింది. అంతేకాదు రాహుల్ ను మిస్ అవుతున్నా అంటూ కామెంట్ పెట్టింది.


చూస్తుంటే రాహుల్ తో పునర్నవి ప్రేమలో ఉన్నా పైకి మాత్రం ఇద్దరు అదేం లేదని అంటున్నారు. సింగర్ గా రాహుల్ కు మంచి ఫాలోయింగ్ ఉంది.. తప్పకుండా అతని కెరియర్ సక్సెస్ ఫుల్ గా సాగుతుందని చెప్పొచ్చు. మరి ఈ పాపులర్ జోడీ వీరి ప్రేమని పెళ్లిదాకా తీసుకెళ్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: