బాలీవుడ్ లో స్టార్ హీరో సల్మన్ ఖాన్ కెరీర్ జర్నీ గురించి తెలిసిందే. ఓవైపు హీరోగా బయటి నిర్మాతలకు సినిమాలు చేస్తూనే తన సొంత బ్యానర్ అయిన ఎస్.ఆర్.కె ఫిల్మ్ లోను సినిమాలు చేస్తున్నాడు. ఇతర నిర్మాతలతో టై అప్ లు పెట్టుకుని భారీ సినిమాలని నిర్మించడం కూడా మనం చూస్తున్నదే. చాలా కాలంగా సల్మాన్ సొంత నిర్మాణ సంస్థలోనే 'దబాంగ్' సిరీస్ సినిమాలు చేస్తున్నాడు. ఇవన్నీ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకొని వందల కోట్లు వసూలు రాబడుతున్నాయి. బాలీవుడ్ లో ఖాన్ ల త్రయం సల్మాన్ - షారూక్- అమీర్ ఖాన్ ఇదే తరహాలో సొంత బ్యానర్లలో సినిమాలు చేయడం సక్సెస్ అందుకోవడం చాలా కాలంగా చూస్తున్నదే.

ఆ ఫార్ములాని మన స్టార్ హీరోలు ఎప్పటి నుంచో వాడుతూ టాలీవుడ్ లో దూసుకుపోతున్నారు. ఈ విషయంలో సూపర్ స్టార్ మహేష్ అందరికంటే చాలా స్పీడ్ గా ఉన్నాడు. చరణ్ .. తర్వాత బన్ని- ఎన్టీఆర్ కూడా అదే విధంగా సొంత నిర్మాణ సంస్థల్ని ఎస్టాబ్లిష్ చేసే ప్లాన్ లో ఉన్నారు. తండ్రి అల్లు అరవింద్ అన్నీ రకాలుగా సపోర్ట్ ఉన్నప్పటికి బన్ని సొంతంగా బ్యానర్ ని ఎస్టాబ్లిష్ చేసే ప్లాన్ లో ఉన్న సంగతి కూడా తెలిసిందే. 

ఇక చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉండి రాజకీయాల్లో బిజీ అయిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా ఇదే రూట్ లో సొంత బ్యానర్ సినిమాలకు సిద్ధమవుతున్నారట. ప్రస్తుతం పవన్ రీఎంట్రీ గురించి ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. పింక్ రీమేక్ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని.. బోనీకపూర్ తో కలిసి దిల్ రాజు ఈ సినిమా నిర్మిస్తున్నారని ప్రచారమవుతోంది. అయితే ఈ సినిమాలో నటించడమే కాదు పవన్ కల్యాణ్ సొంత బ్యానర్ అయిన పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ లో కూడా సినిమాలు నిర్మించేందుకు పవన్ రెడీ అవుతున్నారని సమాచారం. 

పవన్ రీఎంట్రీ పై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. అలాగే పవన్ - రేణు దేశాయ్ వారసుల్ని టాలీవుడ్ లో ఎస్టాబ్లిష్ చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. అందుకే పీకే క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ ని రీబూట్ చేస్తున్నారని మెగా కాంపౌండ్ వర్గాల తాజా సమాచారం. తన బ్యానర్ లో తానే నటిస్తూ సినిమాలు నిర్మించే ఆలోచనలో పవన్ ఉన్నారట. అంతేకాదు ఈ బ్యానర్ లో తన మీద అభిమానం చూపించే యంగ్ అండ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్స్... టెక్నీషియన్స్ కోసమే సగం ఈ బ్యానర్ లో సినిమాలు నిర్మించబోతున్నాడట. ఇక ఇప్పటికే పవన్ కమిట్ అయిన దర్శకులకు సొంత బ్యానర్ లో సినిమాలు చేసే అవకాశం ఇవ్వబోతున్నాడని ఫిల్మ్ నగర్ సమాచారం. 


మరింత సమాచారం తెలుసుకోండి: