టాలీవుడ్ దిగ్గజ నటుల్లో ఒకరైన అక్కినేని నాగేశ్వర రావు హీరోగా స్థిరపడి మంచి పేరు గడించిన తరువాత, అప్పట్లో చెన్నైలో ఉన్న తెలుగు సినిమా పరిశ్రమను మన హైదరాబాద్ కు తీసుకురావాలని నిర్ణయించారు. అంతేకాక ఆ తరువాత ఆయన చెన్నై వదిలి హైదరాబాద్ కు చేరుకోవడం, అనంతరం అక్కడే అన్నపూర్ణ స్టూడియోని నిర్మించడం జరిగాయి. అయితే అన్నపూర్ణ స్టూడియో నిర్మాణం వెనుక గల అసలు విషయాలను సీనియర్ జర్నలిస్ట్ ఒకరు నేడు ఒక మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ చెప్పారు. వివరాల్లోకి వెళితే, గతంలో అక్కినేని నాగేశ్వర రావు మరియు సావిత్రి  కాంబినేషన్లో వచ్చిన గొప్ప చిత్ర రాజం దేవదాసు సినిమా గురించి తెలియని తెలుగు వారుండరు. అయితే నాగేశ్వర రావు పూర్తిగా హైదరాబాద్ షిఫ్ట్ అయిన సమయంలో ఆ సినిమా నిర్మాత, తమ సినిమా హక్కులను వేరొకరికి అమ్ముదాం అని నిర్ణయించి పలువురు సినిమా వారిని సంప్రదించారట. అయితే చివరికి నాగేశ్వర రావు గారే ఆ సినిమా హక్కులను కొనుగోలు చేయడం జరిగిందట.  

నిజానికి అంతకముందు వరకు నాగేశ్వర రావు గారి సినిమాలన్నీ నవయుగ సంస్థ ద్వారానే రిలీజ్ అయ్యేవని, అయితే ఉన్నట్లుండి ఆయన కొనుగోలు చేసిన దేవదాసు ఓల్డ్ మూవీ రైట్స్ తో, ఆ సినిమాను మరొక్కసారి రి రిలీజ్ చేయాలని భావించిన నాగేశ్వరరావు, అప్పుడే కొత్తగా తన భార్య అన్నపూర్ణ గారి పేరు మీద డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏర్పాటు చేసి దాని ద్వారా దేవదాసును రి రిలీజ్ చేయడం జరిగిందట. ఇక్కడ ఒక ముఖ్య విషయం ఏమిటంటే, సరిగ్గా అదే సమయంలో కృష్ణ, విజయనిర్మల కలిసి నటించిన దేవదాసు కూడా రిలీజ్ అయింది. కాగా ఆ రెండు సినిమాలు ఒకే సమయంలో రిలీజ్ అవ్వగా, అందులో పాత దేవదాసు మరొక్కసారి అద్భుతంగా హిట్ కాగా, కృష్ణ గారి దేవదాసు ఫెయిల్ అయిందట. అయితే కృష్ణ దేవదాసు సినిమా మాత్రం నవయుగ సంస్థ ద్వారా రిలీజ్ అయిందట. అయితే నాగేశ్వర రావు గారు తన సొంతం సంస్థ ద్వారా పాత దేవదాసుని రిలీజ్ చేయడంతో, నవయుగ ఫిలిమ్స్ వారికి చెందిన హైదరాబాద్ లోని సారధి స్టూడియోలో ఇక పై నాగేశ్వర రావు గారి సినిమాలు చిత్రీకరించడానికి వీల్లేదని నిర్ణయించారట. 

దానితో అప్పటినుండి నాగేశ్వర రావు గారి సినిమాలు హైదరాబాద్ లో తీయడానికి వీల్లేకుండాపోయిందని, అందువలన అప్పట్లో బెంగళూరు మరియు ఊటీలలో ఆయన సినిమాలు చిత్రీకరించేవారని చెప్పుకొచ్చారు. ఇక అటువంటి పరిస్థితుల్లో ఇకపై హైదరాబాద్ లో తనకు కూడా ఒక స్టూడియో ఉండాలనే గట్టి పట్టుదలతో నాగేశ్వర రావు, తన భార్య అన్నపూర్ణ పేరు మీద స్టూడియోకి శంఖుస్థాపన చేసి కొద్దినెలల్లోనే దాని నిర్మాణం పూర్తి చేసి, అక్కడి నుండి తన సినిమాలను అందులోనే చిత్రికరించడం మొదలెట్టారట. అయితే ఇక్కడ ఒక గమ్మత్తైన విషయం ఏంటంటే, కృష్ణ గారి దేవదాసు సినిమా ఒక రకంగా ఇండైరెక్ట్ గా నాగేశ్వర రావు గారి అన్నపూర్ణ స్టూడియో నిర్మాణానికి కారణం అయిందని ఆయన చెప్పుకొచ్చారు......!! 


మరింత సమాచారం తెలుసుకోండి: