లెక్కల మస్టారు సుకుమార్ లెక్క మారుతోంది. గతంలో డిఫరెంట్ లెక్కలు చేసిన సుక్కు.. ప్రస్తుతం ఒకే లెక్కను పదిసార్లు డిఫరెంట్ మెథడ్స్ లో చేస్తున్నాడు. ఈ లెక్కల గొడవేంటో అర్థం కాలేదు కదూ.. చాలా సింపుల్. సుకుమార్ ఒకే జానర్ లో ప్రయాణీస్తున్నాడు. ఆ జానర్ పేరు రివేంజ్. 


సుకుమార్ అనుకొని రాసుకుంటున్నాడో.. లేదంటే.. రాసుకున్న తర్వాత చూస్తే.. అది రివేంజ్ ఫార్ములా అవుతుందోగానీ.. ఈ ప్రయాణం ఒన్ సినిమా నుంచి మొదలైంది. కెరీర్ మొదట్లో ఆర్య.. 100 పర్సంట్ లవ్ అంటూ ప్రేమలో వైవిద్యం చూపించిన సుక్కు.. ప్రస్తుతం పగ ప్రతీకారంలో డిఫరెంట్ షేడ్స్ చూపిస్తున్నాడు. 


సుకుమార్ ప్రతీకారం ఒన్ సినిమాతో మొదలైంది. సినిమా ఫ్లాప్ అయినా. పగను వదిలిపెట్టకుండా.. నాన్నకు ప్రేమతో తీసి.. ఏవరేజ్ మార్కులు అందుకున్నాడు. ఇదే దారిలో వెళ్తూ.. తీసిన రంగస్థలంలో బ్లాక్ బస్టర్ కొట్టేశాడు. దీంతో బన్నీతో తీసే సినిమాతో కూడా రివేంజ్ తీసుకుంటున్నాడు సుకుమార్. 


బన్నీ, సుకుమార్ మూవీ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్నా.. బలమైన రివేంజ్ ఫార్ములా ఉందట. జానర్ ఒకటే అయినా.. డిఫరెంట్ గా ప్రజెంట్ చేయడం సుక్కు స్టైల్. ఈ ఫార్ములా ఒన్ విషయంలో ఫెయిల్ అయినా.. రంగస్థలం లాంటి అద్భుతమైన హిట్ తీసుకొచ్చింది. బన్నీని అడ్డుపెట్టుకొని తీర్చుకునే ఈ ప్రతీకారం ఎలా ఉంటుందో చూడాలి. 


మొత్తానికి సుకుమార్ పగప్రతీకారంతో రగిలిపోతున్నాడు. ఎలాగైనా ఈ జానర్ లోనే మూవీ తీయాలని కసిమీద ఉన్నాడు. ఇప్పటి వరకు తీసిన సినిమాలు మిశ్రమ ఫలితాలు ఇవ్వడంతో.. మళ్లీ అదే పంథాను ఎంచుకున్నాడు. తను అనుకున్న నటులతో ఆ సీన్ లను ఊహించుకొని పక్కా ప్లాన్  సిద్ధం చేస్తున్నాడు. రాబోయే వేసవి సెలవుల్లో ప్రేక్షకులను కొత్త లోకాన్ని చూపించేందుకు రెడీ అయ్యాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: