తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను ఎంతగానో అలరించే కామెడీ షో జబర్దస్త్ షో లో జడ్జి గా వ్యవహరించే నాగబాబు ఇటీవల షో నుండి తప్పుకున్నట్లు వార్తలు వినబడుతున్నాయి. జబర్దస్త్ షో మొదలైన నాటి నుండి న్యాయనిర్ణేతలుగా రోజా మరియు నాగ బాబు అద్భుతంగా రాణించారు. షో సక్సెస్ఫుల్ అవ్వటానికి గల కారణాలలో వీరిద్దరి పాత్ర కూడా ఎంతో ఉంది. కేవలం స్కిట్ చూసి నవ్వటం మాత్రమే కాక...టీమ్ మెంబర్స్ అందరికీ సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు.


ఇటువంటి నేపథ్యంలో షో నుండి నాగబాబు తప్పుకున్నట్లు నిర్వాహకులతో నాగబాబుకి వివాదం నెలకొన్నట్లు దాంతో నాగబాబు ఈ షో నుండి పూర్తిగా బయటకు రావటానికి డిసైడ్ అయినట్లు ఫిలింనగర్లో వినబడుతున్న టాక్. అయితే జబర్దస్త్ షో ప్రస్తుతం వస్తున్న టిఆర్పి రేటింగ్ గతంలో మొదటి లో ఉన్న సందర్భంలో వస్తున్నట్లు ప్రస్తుతం రావటం లేదు.  కానీ యూట్యూబ్ లో మాత్రం చాలా పాపులారిటీ ఉంది. కోట్లలో వ్యూస్ వస్తుంటాయి. ఇప్పుడు ఈ షోకి పోటీగా ప్రముఖ టీవీ ఛానెల్ ఓ కార్యక్రమం మొదలుపెట్టనుంది. అందులో ధనరాజ్, వేణు వంటి కమెడియన్లు స్కిట్ లు చేయడానికి సిద్ధమవుతున్నారు.


అంతేకాకుండా చాలా మంది పాత కంటెస్టెంట్ జబర్దస్త్ షోలో అలరించిన వారు తాజాగా మొదలయ్యే కొత్త షోకి స్కిట్ లు చేయటానికి రెడీ అవుతున్నట్లు...వార్తలు వినబడుతున్నాయి. దీంతో జబర్దస్త్ షోలో నాగబాబు స్థానం లోకి బండ్ల గణేష్ ని తీసుకోవాలని జబర్దస్త్ షో నిర్వాహకులు సిద్ధం అయినట్లు సమాచారం. ఒక వేళ్ళ బండ్ల గణేష్ ఒపుకోకపోతే సాయి కుమార్ ని గాని అలీని గాని తీసుకోవాలనే ఆలోచనలో జబర్దస్త్ షో నిర్వాహకులు ఉన్నట్లు సమాచారం. మరి ఏమ్ జరుగుతుందో చూడాలి.   



మరింత సమాచారం తెలుసుకోండి: