గత కొద్ది రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల యువతను ఉవ్విళ్లూరిస్తూ రిలీజ్ కు రంగం సిద్ధం చేసుకున్న 'జార్జ్ రెడ్డి' సినిమా మా పైన టీజర్ రిలీజ్ చేసినప్పటి నుంచే వివాదాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆ వివాదాలు కాస్తా ముదిరి సినిమా విడుదల విషయంలో సందిగ్ధత నెలకొంది. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి నాయకుడు అయిన జార్జి రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. వాస్తవంగా జార్జిరెడ్డి లెఫ్ట్ వింగ్ కి చెందిన వాడు. కాబట్టి ఈ సినిమా పై రైట్ వింగ్ కు చెందిన ఎబివీపి నేతలు తీవ్రమైన అభ్యంతరం చెబుతున్నారు.

వారి వాదన ఏమిటంటే వందల మంది ప్రాణాలను జార్జిరెడ్డి పొట్టన పెట్టుకున్నాడు అని... అటువంటి వ్యక్తిని హీరోగా చూపించడం సబబు కాదని అన్నారు. అంతేకాకుండా ఏబీవీపీ విద్యార్థులను ఈ సినిమాలో హీరో యొక్క హీరోయిజాన్ని ఎలివేట్ చేసేందుకు రౌడీలుగా చిత్రీకరించడం తగదని, కావున వెంటనే దీని విడుదలను నిషేధించాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే చిత్రంలో ఎక్కడైనా తమని కించపరిచే సన్నివేశాలు ఉంటే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి అని కూడా హెచ్చరిస్తున్నారు.

జార్జ్ రెడ్డి ఎన్‌ఎస్‌యూఐ స్టూడెంట్ ముసుగులో ఓయూలో ఏబీవీపీపై  దాడులకు పాల్పడిన వ్యక్తి అని చెప్తున్న వీరు.. యూనివర్సిటీకి నకళ్ళు , కత్తులు పరిచయం చేసిన వ్యక్తి జార్జిరెడ్డే అని నొక్కి వక్కాణిస్తున్నారు. సినిమాలో మా సంఘాన్ని కించపరిస్తే సినిమాను అడ్డుకుంటాము అని తీవ్రంగా హెచ్చరిస్తున్న ఈ విధ్యార్ధి సంఘం సెన్సార్ బోర్డు సైతం సినిమా రిలీజ్ విషయంలో నిష్పక్షపాతంగా  వ్వవహరించాలి అని కోరారు. కాగా ఇప్పటికే ఉద్రిక్తతల నేపథ్యంలో మూవీ ప్రీ రిలీజ్ వేడుకను పోలీసులు అడ్డుకున్నారు. కాగా నవంబర్ 22న ‘జార్జ్ రెడ్డి’ చిత్రం రిలీజ్ కాబోతుంది.  దీంతో సినిమా విడుదల విషయంలో నీలిమేఘాలు కమ్ముకుంటున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: