సౌత్ లో స్టార్ హీరోయిన్స్ ఎంతమంది ఉన్నా సరే నయనతారకు ఉండే క్రేజే వేరు. 2003లో మళయాళ పరిశ్రమ నుండి తెరంగేట్రం చేసిన నయనతార ఆ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో సినిమాలు చేసింది. తెలుగులో సీనియర్ స్టార్స్ కు పర్ఫెక్ట్ పెయిర్ గా నయనతార కనిపిస్తుంది. వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ, చిరంజీవిల పక్కన నతించింది నయనతార. 


తెలుగులో ఆమె స్టార్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకోగా కోలీవుడ్ లో మాత్రం అక్కడ స్టార్స్ కు చుక్కలు చూపించేలా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసింది. ఒకానొక దశలో నయనతార సినిమా వస్తుంది అంటే తమిళంలో స్టార్ హీరోలు కూడా వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓ పక్క కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరోపక్క ప్రయోగాత్మక సినిమాలు చేసింది నయనతార.


16 ఏళ్ల సిని కెరియర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసిన నయన్ తమిళంలో 10 ఏళ్లుగా టాప్ ప్లేస్ లో ఉంటూ వచ్చింది. యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ ఆమె చేసిన ప్రయోగాత్మక సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాలు వచ్చాయి. కేవలం స్టార్స్ తోనే కాదు యువ హీరోలతో కూడా ఆమె జోడీ కట్టి అలరించారు.


సినిమా ప్రాధాన్యతను బట్టి ఎలాంటి వారి సరసన అయినా నటించేందుకు ఇష్టపడుతుంది నయనతార. యోగి బాబుతో కొలమావు కోకిల సినిమా చేసి హిట్ కొట్టింది నయనతార. ఇక ఆమె సినిమా వస్తుంది అంటే తమిళ ఆడియెన్స్ అంతా ఎంతో ఎక్సైటింగ్ గా ఎదురుచూస్తారు. ఇక సినిమాలైతే కొత్తగా చేస్తుంది కాని ఆ సినిమా ప్రమోషన్స్ కు మాత్రం దూరంగా ఉంటుంది నయనతార.


నయనతార విషయంలో ఏదైనా నెగటివ్ టాక్ ఉంది అంటే అది కేవలం సినిమా ప్రమోషన్స్ గురించి మాత్రమే అని చెప్పొచ్చు. ఇక తన కెరియర్ లో శింభు, ప్రహుదేవ వంటి స్టార్స్ తో నడిపించిన ప్రేమాయణం కూడా నయనతారన్ స్ట్రాంగ్ గా మారేలా చేశాయి. ప్రస్తుతం దర్శకుడు విఘ్నేష్ శివన్ తో నయనతార ప్రేమలో ఉన్నారు. త్వరలోనే వీరి పెళ్లి జరుగుతుందని తెలుస్తుంది. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న నయనతారకు ఇండియాహెరాల్డ్.కామ్ తరపున కూడా స్పెషల్ బర్త్ డే విషెష్ అందచేస్తున్నాం.    



మరింత సమాచారం తెలుసుకోండి: