టాలీవుడ్ కింగ్ నాగార్జున ఆరు పదుల వయసు వచ్చినా గానీ అందం విషయంలో కుర్రతనం గా ఇంకా కనిపిస్తూనే ఉంటారు. ఇటీవల టెలివిజన్ ప్రేక్షకులను బిగ్ బాస్ సీజన్ 3 రియాల్టీ షో ద్వారా హోస్ట్ గా వ్యవహరించి అలరించారు. ఇదిలా ఉండగా ఇండస్ట్రీలో కొత్త కొత్త దర్శకులకు అవకాశాలు ఇస్తూ టాలెంట్ ఎంకరేజ్ చేయడంలో ముందుండే నాగార్జున ఏదైనా సినిమా డైరెక్టర్ తో పని చేస్తే ఆ సదరు సినిమా డైరెక్టర్ సరైన ఫలితం ఇవ్వకపోతే వారి పైన నెగిటివ్ కామెంట్ చేస్తారు అన్న కామెంట్ నాగార్జున పై ఇండస్ట్రీలో ఉంది. గతంలో వీరభద్రం చౌదరి దర్శకత్వంలో భాయ్ సినిమా చేసిన సందర్భంగా సినిమా దారుణంగా ఫ్లాప్ కావడంతో సదరు డైరెక్టర్ పై నాగార్జున నెగిటివ్ గా మాట్లాడినట్లు వార్తలు వచ్చాయి. దీంతో సదరు డైరెక్టర్  కెరియర్ పై ఆ ప్రభావం బాగా కనిపించిందట.


తాజాగా నాగార్జున కెరీర్లో సూపర్ డూపర్ హిట్ అయిన మన్మధుడు సినిమా సీక్వెల్ తీసి ఇటీవల దారుణమైన ఫ్లాప్ చూశాడు. అయితే ఆ సినిమా చేస్తున్న సందర్భంలో కింగ్ నాగార్జున...మన్మధుడు సీక్వెల్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ ని కూడా స్క్రిప్ట్ పరంగా చాలా ఇబ్బంది పెట్టినట్లు సమాచారం. రాహుల్ స్క్రిప్ట్ లో మార్పులు చేసి తనకు నచ్చినట్లుగా సినిమా తీయించాడు. ఇక 'సోగ్గాడే చిన్ని నాయన' సినిమా డైరెక్టర్ పరిస్థితి కూడా అలానే ఉంది. ఇదే కోవకు చెందిన డైరెక్టర్ 'ఢమరుకం' సినిమా తీసిన డైరెక్టర్ శ్రీనివాస రెడ్డి ఇటీవల...ఓయ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ...పరోక్షంగా నాగార్జున పై కామెంట్ చేసినట్లు ఫిల్మ్ నగర్ లో వార్తలు వినబడుతున్నాయి.


విషయంలోకి వెళితే నాగార్జున కెరీర్లో అతి పెద్ద హిట్ సినిమా అయినా హలో బ్రదర్ సినిమా సీక్వెల్ చేద్దామని నాగార్జున ప్రపోజల్ పెట్టి ఆ స్క్రిప్టుపై వర్క్ చేసిన తర్వాత హలో బ్రదర్ సీక్వెల్ సినిమా పక్కనపెట్టి నాగచైతన్యతో దుర్గా సినిమా చేయాలని అవకాశం ఇచ్చి తర్వాత ఆ ప్రాజెక్టు కూడా నాగార్జున క్యాన్సిల్ చేశారు. దీంతో క్యాన్సిల్ అయిన ప్రాజెక్ట్ ల వలనే తన కెరీర్ ఇలా తయారైందంటూ పరోక్షంగా నాగార్జున మీద తన అసహనాన్ని చూపించాడు. కొన్నిసార్లు ఇలా అవుతుంటాయి.. ఏం చేయలేమంటూ కామెంట్స్ చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: