నాపేరు సూర్య సినిమా దారుణంగా ఫ్లాప్ కావడంతో తీవ్ర నిరాశకు గురైన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా మొదలు పెట్టడానికి చాలా టైమ్ తీసుకుని చివరాకరికి తనకి 2 సూపర్ డూపర్ హిట్లు కెరియర్లో ఇచ్చిన డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కి ఆయన చెప్పిన 'అల వైకుంఠపురం లో' సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లో బిజీ బిజీగా ఉన్నారు. సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న ఈ సినిమా సాంగ్స్ ఇటీవల రెండు విడుదలయ్యాయి. విడుదలైన రెండు సాంగ్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో రికార్డులు మీద రికార్డులు సృష్టిస్తూ...సంగీత ప్రియులను మరియు అల్లుఅర్జున్ అభిమానులను ఎంతగానో అలరిస్తున్నాయి.


అంతేకాకుండా ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ టబు మరియు అక్కినేని సుశాంత్ మరియు సునీల్ సినిమాలో నటించడంతో 'అలా వైకుంఠపురం లో' సినిమాపై అల్లు అర్జున్ అభిమానులు భీభత్సమైన అంచనాలు పెట్టుకున్నారు. ఇదిలా ఉండగా సినిమా జరుగుతుండగానే సుకుమార్ సినిమా ఓకే చేసి ఇటీవల ఆ సినిమాకి సంబంధించి పూజా కార్యక్రమం మొదలుపెట్టిన అల్లు అర్జున్ ఆ సినిమాలో సరికొత్త లుక్ లో కనబడ పోతున్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వినబడుతున్నాయి.


అంతేకాకుండా ఈ సినిమా గంధం చెక్కల మాఫియా చుట్టూ తిరుగుతూ, రివెంజ్ బ్యాక్ డ్రాప్ కథాంశంతో భారీ స్థాయి యాక్షన్ మూవీగా తెరకెక్కబోతున్నట్లు దీంతో బన్నీ ఊర మాస్ క్యారెక్టర్లో కనిపించనున్నాడట. అందుకోసం ఆయన అప్పుడే తన శరీరాన్ని దృఢంగా తయారుచేయటానికి సిద్ధమైనట్లు సమాచారం. అది మాత్రమే కాక, కొద్దిపాటి గడ్డంతో రఫ్ లుక్ లో బన్నీ ఈ సినిమాలో కనిపించబోతున్నారని టాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. దీంతో వస్తున్న వార్తలను బట్టి చూస్తుంటే రంగస్థలం తరహాలోనే అల్లు అర్జున్ తో కూడా సుకుమార్ సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: