కాస్త లేటైనా లేటెస్ట్ గా రావడం అమీర్ ఖాన్ స్టైల్. థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ ఫ్లాప్ తర్వాత.. అందరూ మెచ్చే సినిమాతో వస్తానని మాటిచ్చిన అమీర్ ఖాన్ తొలి చూపులోనే ఆ మాట నిలబెట్టుకున్నాడు. ఎలా అంటారా ? 


అమీర్ ఖాన్ ఉన్నట్టుండి.. సింగ్ గా మారిపోయాడు. ఆయన ఏ గెటప్ వేసినా.. తను కనిపించకుండా.. పాత్రనే చూపిస్తాడు. థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ ఫ్లాప్ తో అమీర్ ఖాన్ ఒకటికి పదిసార్లు ఆలోచించాడు. నెలలు గడిచినా.. సినిమా మొదలుపెట్టలేదు. ఎట్టకేలకు క్లాసిక్ మూవీ "ఫారెస్ట్ గంప్" ను ఇన్ స్పిరేషన్ గా తీసుకొని.. "లాల్ సింగ్ చద్దా" సినిమా చేస్తున్నాడు అమీర్. 


బాలీవుడ్ హీరోలు చాలా మంది సింగ్ గా నటించారు. మిస్టర్ పర్ ఫెక్షనిస్ట్ సిక్కుగా నటిస్తే.. ఆ గెటప్ తీర్చిదిద్దినట్టుకాకుండా.. ఒరిజినల్ గా ఉంటుంది. లాల్ సింగ్ చద్దా ఫస్ట్ లుక్ లో గుబురు గడ్డం.. తలపై టర్బన్ చూస్తుంటే.. అమీర్ ఖాన్ ను ఎందుకు పర్ ఫెక్షనిస్ట్ అంటారో అర్థమవుతుంది. సినిమా కోసం అమీర్ 20కేజీలు వెయిట్ తగ్గాడు. 


లాల్ సింగ్ చద్దాలో హీరోయిన్ గా కరీనాకపూర్ ను ఆడిషన్స్ చేసి.. అందరూ ఒకే అన్న తర్వాతే తీసుకున్నారట. అద్వైత్ చందన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అమీర్ తో పాటు.. వయాకామ్ 18 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తోంది. ఫస్ట్ లుక్ తో పాటు.. సినిమా ఎప్పుడొచ్చేది చెప్పేశారు నిర్మాతలు. అమీర్ కు కలిసొచ్చిన సీజన్ క్రిస్మస్ కు రిలీజ్ చేస్తున్నారు. 
మొత్తానికి అమీర్ ఖాన్ న్యూలుక్ ఆయన అభిమానులనే కాదు... సామాన్య ప్రేక్షకులను కూడా మెప్పిస్తోంది. మరి ఆయన ఆ మూవీలో ఎలా మెప్పిస్తారో చూడాల్సిందే. 
క్రిస్మస్ కు రాబోయో సినిమా కోసం అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. 




మరింత సమాచారం తెలుసుకోండి: