టాలీవుడ్ సినిమా పరిశ్రమకు కొన్నేళ్ల క్రితం కెరటం అనే సినిమాతో అడుగుపెట్టిన రకుల్ ప్రీత్ సింగ్, ఆ తరువాత సందీప్ కిషన్ తో కలిసి నటించిన వేంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా తొలి సక్సెస్ ని అందుకుంది. ఆ తరువాత గోపీచంద్ తో చేసిన లక్ష్యం కూడా సూపర్ హిట్ కొట్టడంతో ఆ తరువాత నుండి రకుల్ కు టాలీవుడ్ అవకాశాలు విరివిగా రావడం మొదలయ్యాయి. ఇక అక్కడినుండి పలువురు టాలీవుడ్ అగ్ర హీరోల సరసన నటించిన రకుల్ ప్రీత్, కొన్ని విజయాలతో పాటు అపజయాలు కూడా మూటగట్టుకుంది. 

ఇక తెలుగుతో పాటు తమిళ్, హిందీ లో కూడా మంచి సక్సెస్ఫుల్ సినిమాల్లో నటించిన రకుల్, ప్రస్తుతం మాత్రం టాలీవుడ్ లో ఒక్క అవకాశం కూడా లేక కొంత సతమతం అవుతోంది. అయితే తమిళ్ లో మాత్రం కమల్ హాసన్, శంకర్ ల భారీ ప్రతిష్టాత్మక సినిమా భారతీయుడు 2లో అవకాశం దక్కించుకుంది ఈ భామ. ఇక ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత మరియు సినిమా సంగతులు అభిమానులతో షేర్ చేసుకునే రకుల్, నేడు ఒక ఫోటో షూట్ లో పాల్గొంది. వాస్తవానికి ఎక్కువగా డైటింగ్ మెయిన్ టెయిన్ చేస్తూ ఎక్సర్సైజ్, యోగ వంటివి చేస్తూ ఉండే రకుల్ ఇటీవల చాలా నాజూగ్గా తయారయింది. 

ఇకపోతే నేడు ఆమె పాల్గొన్న ఒక ఫోటోషూట్ లో భాగంగా దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఆ ఫొటోల్లో చాలా సన్నగా ఉండడంతో పాటు, ఫేస్ కూడా కొంత మార్పుతో కనపడిన రకుల్ ని చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఏంటి ఉన్నట్లుండి రకుల్ ఒక్కసారిగా ఇలా బక్కగా మారిపోయింది అంటూ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్స్ చేయడం మొదలెట్టారు. కాగా ఆమె భారతీయుడు 2 మూవీ కోసమే ఇంత సన్నగా, నాజూగ్గా తయారయినట్లు టాక్......!! 


మరింత సమాచారం తెలుసుకోండి: