ఇక తెలుగుతో పాటు
తమిళ్,
హిందీ లో కూడా మంచి సక్సెస్ఫుల్ సినిమాల్లో నటించిన
రకుల్, ప్రస్తుతం మాత్రం
టాలీవుడ్ లో ఒక్క అవకాశం కూడా లేక కొంత సతమతం అవుతోంది. అయితే
తమిళ్ లో మాత్రం
కమల్ హాసన్,
శంకర్ ల భారీ ప్రతిష్టాత్మక
సినిమా భారతీయుడు 2లో అవకాశం దక్కించుకుంది ఈ భామ. ఇక ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత మరియు
సినిమా సంగతులు అభిమానులతో షేర్ చేసుకునే
రకుల్, నేడు ఒక ఫోటో షూట్ లో పాల్గొంది. వాస్తవానికి ఎక్కువగా డైటింగ్ మెయిన్ టెయిన్ చేస్తూ ఎక్సర్సైజ్, యోగ వంటివి చేస్తూ ఉండే
రకుల్ ఇటీవల చాలా నాజూగ్గా తయారయింది.
ఇకపోతే నేడు ఆమె పాల్గొన్న ఒక ఫోటోషూట్ లో భాగంగా దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఆ ఫొటోల్లో చాలా సన్నగా ఉండడంతో పాటు, ఫేస్ కూడా కొంత మార్పుతో కనపడిన
రకుల్ ని చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఏంటి ఉన్నట్లుండి
రకుల్ ఒక్కసారిగా ఇలా బక్కగా మారిపోయింది అంటూ తమ సోషల్
మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్స్ చేయడం మొదలెట్టారు. కాగా ఆమె భారతీయుడు 2
మూవీ కోసమే ఇంత సన్నగా, నాజూగ్గా తయారయినట్లు టాక్......!!