నందమూరి నట సింహం బాలకృష్ణ తన కెరీర్లో చేసిన ఓ మధుర జ్ఞాపకం లాంటి సినిమా ఆదిత్య 369. ఈ సినిమా ఆయన కెరీర్లో ఎంతో ప్రత్యేకమైన సినిమా. సినిమాలో శ్రీ కృష్ణదేవరాయలు పాత్రలో ఆయన పరకాయ ప్రవేశం చేశారా.. ఆ శ్రీ కృష్ణదేవరాయలే బాలకృష్ణ రూపంలో వచ్చారా అనేంతగా బాలయ్య ఆ పాత్రను పోషించి మెప్పించారు. ఆ పాత్రలో బాలయ్యను తప్ప మరెవరినీ ఊహించలేనంతగా నటించి, మెప్పించారు.

 


టైమ్ మెషీన్ లో కాలంలో వెనక్కు వెళ్లే ఓ టిపికల్ సైన్స్ ఫిక్షన్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో బాలకృష్ణ డ్యూయల్ రోల్ పోషించారు. యూత్ క్యారెక్టర్ లో కృష్ణ కుమార్ అనే పాత్రలో కూడా నటించాడు బాలయ్య. వెటరన్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. నిజానికి ఈ సినిమాలో కృష్ణ కుమార్ పాత్రకు మొదటగా కమల్ హాసన్ తీసుకోవాలని భావించారట దర్శకుడు. ఈ మేరకు కమల్ తో స్టోరీ సిట్టింగ్స్, కమల్ అంగీకరించటం కూడా జరిగిందట. కానీ.. షూటింగ్ టైమ్ కి కమల్ కు తమిళ్ లో ఉన్న కమిట్ మెంట్స్ తో డేట్స్ అడ్జెస్ట్ చేయడం ఆయన వల్ల కాలేదట. దీంతో షూటింగ్ డిలే అయి మిగిలిన ఆర్టిస్టు డేట్స్ క్లాష్ అవుతున్నాయని భావించారట. దీంతో రెండో పాత్రలో కూడా బాలయ్యనే నటింపజేసి డ్యూయల్ రోల్ గా మార్చారట.

 


1991లో వచ్చిన ఈ సినిమా బాలకృష్ణ కెరీర్లోని సూపర్ హిట్స్ లో ఒకటి. ఈ సినిమా కోసం అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి సినిమాకు టీవీల్లో ప్రమోషన్ చేశారు. ఈ సినిమాలో కమల్ నటించి ఉంటే అప్పట్లోనే బిగ్గెస్ట్ మల్టీస్టారర్ గా నిలిచేదనడంలో సందేహం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: