మెగా బ్రదర్ నాగబాబు ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. ఎందుకంటే ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాగబాబు... ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ లో జడ్జ్ గా  అవతారమెత్తి ఎంతోమంది తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ప్రస్తుతం నాగబాబు అనగానే ఠక్కున గుర్తొచ్చే పేరు జబర్దస్త్. జబర్దస్త్ షోలో ఆయన నవ్వుతోనే జబర్దస్త్ కామెడీ షో కీ  ఎంతో క్రేజ్ తీసుకొచ్చారు నవ్వుల నాగబాబు. జబర్దస్త్ షో కి జడ్జిగా ఏంట్రీ  మెగా బ్రదర్ నాగబాబు నవ్వుల రారాజు గా మారిపోయారు. కేవలం నాగబాబుగారు నవ్వుల కోసమే జబర్దస్త్  చూసే ప్రేక్షకులు ఎంతో మంది. అయితే మెగా బ్రదర్ నాగబాబు ఇటు సినిమాలు అటు రాజకీయాల్లోనూ రాణిస్తున్నారు. తాజాగా  జనసేన తరపున ఎంపీగా కూడా పోటీ చేశారు నాగబాబు.కానీ  విజయం సాధించలేకపోయారు. 

 

 

 

 అటు సినిమాల్లో కూడా విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ దూసుకుపోతున్నారు మెగా బ్రదర్ నాగబాబు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన  తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పరచుకున్నారు. ఒకానొక సమయంలో సినిమాలను నిర్మించారు కూడా. కానీ సినిమా నిర్మాణం లో నాగబాబు కు అంతగా కలిసి రాకపోవడంతో సినిమా నిర్మాణాన్ని వదిలేశారు నాగబాబు. నాగబాబు నిర్మించిన చివరి  సినిమా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఆరెంజ్ సినిమా. ఇక ఆ తర్వాత ఈ టీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ లో జడ్జ్ గా  అవతారమెత్తిన నాగబాబు ఎంతో ఫేమస్ అయిపోయారు. జబర్దస్త్ షోలో స్పాంటినియస్ పంచులు వేస్తూ కమీడియాన్స్  కంటే ఎక్కువ నవ్వులు పండిస్తారు నాగబాబు. 

 

 

 

 ఇక సినిమాల్లో కూడా భిన్నమైన పాత్రలో నటిస్తూ దూసుకుపోతున్నారు. అయితే తాజాగా నాగబాబు ఫేస్ బుక్  లో ఆయనకు సంబంధించిన కొన్ని ఫోటోలను పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. ఎందుకంటే ఇప్పుడు వరకు నాగబాబును చూడలేనంత  కొత్త లుక్ తో ఈ ఫోటోలలో కనిపిస్తున్నారు మెగా బ్రదర్. ఈ ఫొటోల్లో ఎంతో యంగ్ గా  ఎంతో హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నారు బ్రదర్ నాగబాబు. మెగా అభిమానులందరి ఈ ఫోటోలు బాగా ఆకర్షిస్తున్నాయి. నాగ బాబు సార్ మీ లుక్ సూపర్ అంటూ అభిమానులు కామెంట్లు కూడా పెడుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: