సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఆయన ఏంచేసినా సంచలనమే మారిపోతుంది. ఏం మాట్లాడినా అదో పెద్ద దుమారమే రేపుతోంది. అందుకే ఈయన్ను  అందరూ వివాదాల దర్శకుడు అని అంటారు . వర్మ  కూడా ఎప్పుడూ ఏదో ఒక వివాదానికి కేరాఫ్ అడ్రెస్స్ గా  ఉంటారు. ఇక వర్మ ఎప్పుడు ఎవరిని ఎలా టార్గెట్  చేస్తారు అన్నది ఊహించలేం. ఇక వర్మ సినిమాలు కూడా కేరాఫ్ వివాదాలు అన్నట్టుగా ఉంటాయి. ఏ సినిమా తీసినా అందులో ఓ వివాదం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. వివాదాలతోనే వర్మ సినిమాలు తీస్తారు అనడంలో అతిశయోక్తి లేదు. ఇప్పటికే ఎన్నో వివాదాస్పద సినిమాలు తెరకెక్కించారు రామ్ గోపాల్ వర్మ. ఇక తన సినిమాలకు  ఎలాంటి ప్రచారం లేకుండానే చాలా క్రేజ్ సంపాదించిస్తారు  రామ్ గోపాల్ వర్మ  . 

 

 

 

 అయితే తాజాగా వివాదాస్పద దర్శకుడు వర్మ  కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే సినిమాతో మరో సంచలనానికి తెర లేపిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకూ జరిగిన రాజకీయ పరిణామాలు  అన్నింటిని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అన్ని సినిమాలు చూపించబోతున్నారు అని  ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ కు  కూడా మంచి స్పందన వచ్చింది. ఈ ట్రైలర్ లో  ఎవరెవరెవారిని  చూపించబోతున్నారో  ఫుల్ క్లారిటీ ఇచ్చారు వర్మ. ఆంధ్రప్రదేశ్ రాజకీయలోని ప్రముఖులు అందరిని చూపిస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు. ఇక తాజాగా నారా లోకేష్ గురించి పప్పు లాంటి అబ్బాయి అని వీడియో సాంగ్ విడుదల చేసి సెన్సేషన్ సృష్టించారు. 

 

 

 

 అంతేకాదండోయ్ సినిమాకు సీక్వెల్ కూడా తీస్తాను అంటూ వర్మ తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే తాజాగా ఓ  యూట్యూబ్ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వర్మ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా టైటిల్ ఒక కులంను  టార్గెట్ చేస్తున్నట్లుగా ఉంది అంటూ యాంకర్ అడిగిన ప్రశ్నికు  ఇప్పటికే రెడ్డి టైటిల్ తో పాటు నాయుడు టైటిల్స్ తో కూడా ఎన్నో సినిమాలు వచ్చాయి సమాధానం  ఇచ్చారు వర్మ. ఒకవేళ సినిమా టైటిల్ పై సెన్సార్ బోర్డు ఏదైనా అభ్యంతరం చెబితే ఏం చేస్తారు అంటూ యాంకర్  ప్రశ్నించారు. వెంటనే సినిమా టైటిల్  కమ్మ రాజ్యం లో కడప రెడ్లు టైటిల్ ను తీసేసి మక్క  రాజ్యంలో డకప  రెడ్లు  అనే టైటిల్ ప్రకటిస్తానని వర్మ సమాధానం చెప్పారు. ఒకవేళ నిజంగానే సెన్సార్ బోర్డు టైటిల్ విషయంలో అభ్యంతరం వ్యక్తం చేస్తే  టైటిల్ మార్పు విషయంలో కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: