సౌత్ ఇండియా బిగ్ బాస్ హిస్టరీలో ఒక రియల్ లైఫ్ జంట బిగ్ బాస్ రియాలిటీ షోకి వెళ్లడం ఇదే తొలిసారి. వితికా షెరు, వరుణ్ సందేశ్‌లు బిగ్ బాస్ సీజన్ 3తో క్రేజీ కపుల్‌గా మారారు మొత్తంగా ఈ  జంట బిగ్ బాస్ హౌస్‌లో కలర్ ఫుల్‌గా కనిపించి ప్రేక్షకుల్ని అలరించారు.
 
వరుణ్ ఫైనల్ వరకూ ఉంటే.. వితికా 13వ వారంలో ఎలిమినేట్ అయ్యారు. ఇక బిగ్ బాస్ హౌస్‌ నుండి బయటకు వచ్చిన తరువాత వరుణ్ సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతుండగా.. వితికా సైతం గ్లామర్ ఫీల్డ్‌లో రాణించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. బిగ్ బాస్‌తో క్రేజ్ సంపాదించుకున్న వితికా నెక్స్ట్ ఏం చేయబోతున్నారు?  అయితే అప్పట్లో సంచలనం రేపిన ‘వితికా షెరు ఆత్మహత్యాయత్నం’ అనే ఇష్యూపై మరోమారు స్పందించారు వితికా. అసలు ఆరోజు ఏం జరిగింది. ఆత్మహత్యాయత్నం అనే వార్త ఎలా బయటకు వచ్చిందో  వివరించారు... 
 
‘నేను స్లీపింగ్ టాబ్లెట్స్ తీసుకున్న మాట వాస్తవమే. కాని ఎందుకు తీసుకున్నాను అంటే.. నేను యూఎస్‌లో ఆరు నెలలు  ఉన్నాను ఆ తరువాత ఇండియాకి వచ్చాను. అయితే అక్కడికి ఇక్కడికి వాతావరణ మార్పుల వల్ల నిద్ర పట్టేది కాదు.నిజానికి మేం హాలిడే ట్రిప్స్ ప్లాన్ చేసుకున్నాం. అందుకే మనశాంతిగా పడుకుందాం అని స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకున్నా. వాటిని తీసుకోవడం నాకు అదే ఫస్ట్ టైం. మొదట ఒక టాబ్లెట్ వేసుకుని ట్రై చేశా అయినా నిద్ర రాలేదు. దీంతో వన్ అవర్ వెయిట్ చేసి మరో ట్యాబ్లెట్ వేసుకున్నా. రెండు ట్యాబ్లెట్స్ వేసుకున్నా నిద్రరాకపోవడంతో మరో రెండు వేసుకున్నా. అది కూడా 0.5 ఎమ్. జీ పవర్ ది . అయితే నాలుగు టాబ్లెట్స్ వేసుకున్న గంట తరువాత నిద్ర పట్టింది. అలా రాత్రి 1 గంటకు నేను నిద్ర పోయా. ఉదయాన్నే 6 గంటలకు మా అమ్మ వచ్చి నన్ను లేపడానికి ట్రై చేసింది. నేను నిద్ర మత్తులో ఉండిపోయి లేవలేకపోవడంతో నన్ను హాస్పటల్‌కి తీసుకుని వెళ్లారు. వాళ్లు నాకు స్టమక్ వాష్ చేశారు. ఆ సందర్బంలో నా ఫోన్‌లోనే ఒక ఫొటో తీశారు. ఆ ఫొటో నా ఫ్రెండ్ ద్వారా బయటకు వెళ్లింది. నేను ట్రీట్ మెంట్ తీసుకుని ఈవినింగ్ డిస్చార్చ్ అయ్యి ఇంటికి వెళ్లా. ఫ్రెండ్స్‌తో కలిసి డిన్నర్‌ పార్టీకి వెళ్లా. 
ఇంతలో న్యూస్‌లో వితికా షెరు ఆత్మహత్య అని బ్రేకింగ్ వస్తోంది. ఆ తరువాత నేను వెళ్లి మీడియాకి జరిగిన విషయం చెప్పా. అంతేతప్ప నేను ఆత్మహత్యా ప్రయత్నం చేసిందీ లేదు.. చనిపోదాం అని అనుకున్నది లేదు. అవన్నీ రూమర్స్ మాత్రమే’ అంటూ మరోమారు క్లారిటీ ఇచ్చింది వితికా షెరు.


మరింత సమాచారం తెలుసుకోండి: