స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరక్షన్ లో ఓ సినిమా మొదలు కాబోతుందన్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఆర్య, ఆర్య 2 సినిమాలతో సుకుమార్, అల్లు అర్జున్ కాంబో అంటే క్రేజ్ ఏర్పరచుకున్నారు. ఇక ఇప్పుడు హ్యాట్రిక్ మూవీ త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతుంది.

 

సినిమా కథ ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగుతుందట. సినిమాలో బన్ని లారీ డ్రైవర్ గా కనిపిస్తాడని అంటున్నారు. ఎంచుకున్న పాత్ర కోసం ఎలా అయినా కనిపించడానికి ఇష్టపడే బన్ని సుక్కు సినిమా కోసం మాస్ లుక్ లో లారీ డ్రైవర్ గా సర్ ప్రైజ్ చేస్తాడట. హీరో డీ గ్లామరస్ గా కనిపించే సినిమాలు వచ్చి చాలా ఏళ్లు అవుతుంది.

 

రంగస్థలంతో హిట్ అందుకున్న సుకుమార్ ఈ సినిమాను కూడా పక్కా తన మార్క్ కనిపించేలా తీస్తాడని అంటున్నారు. ఈ సినిమాకు టైటిల్ దగ్గర నుండి సినిమా మేకింగ్ వరకు ప్రతి ఒక్కటి చాలా ప్రత్యేకంగా ఉండాలని సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడట. మహేష్ కాదన్న కథనే బన్ని కోసం కొద్దిమార్పులు చేసి సినిమా చేస్తున్నాడు సుకుమార్. అయితే ఈ సినిమాతో హిట్టు కొట్టి మహేష్ నిర్ణయం తప్పని ప్రూవ్ చేయాలని అనుకుంటున్నాడు. సినిమాలో బన్ని లారీ డ్రైవర్ అని తెలియగానే మెగా ఫ్యాన్స్ తో పాటుగా బన్ని ఫ్యాన్స్ కూడా జోష్ లో ఉన్నారు. మాస్ కా బాప్ అనేలా ఈ మూవీ ఉంటుందని ముందే హింట్ ఇస్తున్నాడు సుకుమార్. 

 

ఈ మూవీలో హీరోయిన్ గా క్రేజీ బ్యూటీ రష్మిక మందన్న నటిస్తుంది. వరుస సినిమాలతో రష్మిక తెలుగులో సూపర్ పాపులారిటీ తెచ్చుకుంది. బన్నితో రష్మిక మొదటిసారి జోడీ కడుతుంది. ఆల్రెడీ మహేష్ సరసన రష్మిక సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటిస్తుంది. నితిన్ భీష్మలో కూడా అమ్మడు హీరోయిన్ గా చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: