దేవి శ్రీ ప్రసాద్ కొద్దిగా వెనక్కి తగ్గాడనిపించే సరికి తనకు వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగ పరచుకుంటున్నాడు ఎస్.ఎస్.థమన్. ఓ పక్క కాపీ క్యాట్ అన్న విమర్శలు వస్తున్నా సరే అతను ఈమధ్య ఇస్తున్న సాంగ్స్ కు మ్యూజిక్ లవర్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. కేవలం సాంగ్స్ తోనే కాదు బిజిఎం కూడా అదరగొట్టేస్తున్నాడు థమన్.

 

అల్లు అర్జున్ అల వైకుంఠపురములో మొదటి సాంగ్ సామజవరగమనతో మొదలు పెట్టిన థమన్ ఆ తర్వాత అదే సినిమా నుండి రాములో రాములా అంటూ వచ్చి శ్త్రోలని అలరించాడు. బన్ని సినిమా నుండి రిలీజైన రెండు సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. రీసెంట్ గా మాస్ మహరాజ్ రవితేజ హీరోగా చేస్తున్న డిస్కో రాజా సినిమాలో కూడా నువ్వు నాతో ఏమన్నావో అనే సాంగ్ మరోసారి థమన్ సత్తా చాటింది.

 

ఇక ఇప్పుడు సాయి తేజ్ హీరోగా మారుతి డైరక్షన్ లో వస్తున్న సినిమా ప్రతిరోజు పండుగే సినిమా నుండి థమన్ మరో క్రేజీ సాంగ్ తీసుకొచ్చాడు. ఓ బావా అంటూ వచ్చే ఈ సాంగ్ రీసెంట్ గా ప్రోమో రిలీజ్ చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈరోజు ఆ సాంగ్ మొత్తం రిలీజ్ చేశారు.   

 

ఓ బావా అంటూ అక్క గురించి బావతో మరదళ్లు పాడే ఈ పాట అదిరిపోయింది. మరోసారి థమన్ తన మెలోడీ మార్క్ చూపించాడు. ఈమధ్య థమన్ సాంగ్ రిలీజ్ అవుతుంది అంటే అదో పెద్ద సెన్సేషన్ అన్నట్టుగా ఉంది. మరి ఈ సినిమాలన్ని హిట్ అయితే థమన్ డబుల్ క్రేజ్ సంపాదించడం ఖాయం. ఇవే కాకుండా విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య కలిసి చేస్తున్న మల్టీస్టారర్ మూవీ వెంకీమామకు థమన్ మ్యూజిక్ ఇస్తున్నాడు. ఆ సినిమాలో ఎన్నాళ్లకో సాంగ్ ఇప్పటికే హిట్ అయ్యింది.   

 

https://youtu.be/_pJhHm6svjc

మరింత సమాచారం తెలుసుకోండి: