వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన దర్శకుడు రాంగోపాల్ వర్మ. ఎప్పుడు  ఏదో ఒక వివాదంతో తెరమీదికి వస్తూనే ఉంటారు. వివాదాలు లేకుండా వర్మ ఉండలేడు వర్మ లేకుండా వివాదాలు ఉండలేవు అన్నట్లుగా ఉంటుంది. అందుకే ఎప్పుడూ ఏదో ఒక వివాదం వర్మ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇక వర్మ ఎప్పుడు ఎవరిని ఎలా టార్గెట్ చేస్తూ కామెంట్ చేస్తాడో  అసలు ఊహించలేం . అయితే వర్మ తెరకెక్కించే సినిమాలు కూడా వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉంటాయి. ఇప్పటికే ఎన్నో వివాదాస్పద సినిమాలను తెరకెక్కించిన రాంగోపాల్ వర్మ సంచలనాలు సృష్టించారు. గత ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముందు లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో ఎన్టీఆర్ బయోగ్రఫీ  తెరకెక్కించిన వర్మ సినిమాలో చంద్రబాబు ఎన్టీఆర్ ఎలా వెన్నుపోటు పొడిచారని దాని పై నిజాలు చెబుతాను అంటూ సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. 

 

 

 

 ఇక తాజాగా కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అంటూ మరో వివాదాస్పద సినిమాకు తెరలేపాడు రామ్ గోపాల్ వర్మ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరిగిన పరిణామాలు అన్నింటిని తన సినిమాల్లో చూపించబోతున్నట్లు  ఇప్పటికే వర్మ క్లారిటీ ఇచ్చారు కూడా. అంతే కాకుండా ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ లో ఎవరెవరి పాత్రలో తన సినిమాల ఉండబోతున్నాయని  కూడా క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ సినిమాలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి టిడిపి అధినేత చంద్రబాబు నారా లోకేష్ సహా ఆంధ్రప్రదేశ్లోని పలు కీలక నేతలు పాత్రలను ట్రైలర్లు చూపించారు. అంతేకాకుండా కేంద్రంలోని అమిత్షా మోడీ లను కూడా వదలలేదు రామ్ గోపాల్ వర్మ. అయితే ఈ ట్రైలర్ లో టిడిపిలో ముఖ్య నేత అయిన బాలకృష్ణ పాత్ర మాత్రం ఎక్కడా కనిపించలేదు. అప్పట్లో లక్ష్మీస్ ఎన్టీఆర్ లో బాలకృష్ణ పాత్రను తెరకెక్కించినప్పటికీ తాజాగా కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే సినిమాలో మాత్రం బాలకృష్ణ పాత్ర కనిపించదు. 

 

 

 

 దీంతో  బాలకృష్ణ వర్మ కు వార్నింగ్ ఇచ్చారని అందుకే బాలకృష్ణ పాత్రను తన సినిమాలు తీయడం లేదని... లేదు వర్మ నెక్స్ట్ ట్రైలర్లో బాలకృష్ణ పాత్ర ను విడుదల చేయబోతున్నారు అంటూ ఇలా విభిన్నమైన వార్తలు హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. అయితే వివాదాలతోనే తన సినిమాకు పబ్లిసిటీ పెంచుకునే వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా తన సినిమాలో బాలకృష్ణ పాత్ర గురించి క్లారిటీ ఇచ్చారు.ఓ  యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినిమాలో బాలకృష్ణ పాత్ర గురించి రాంగోపాల్ వర్మ క్లారిటీ ఇచ్చారు . కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే సినిమాలో బాలకృష్ణ పాత్ర లేదని రాంగోపాల్ వర్మ తెలిపారు. ఆయన పాత్ర లేకుండానే ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలిపారు. ఆయన పాత్రకు అంతగా ప్రాధాన్యం లేదని అందుకే బాలకృష్ణ పాత్ర తన సినిమాలో  పెట్టలేదని వర్మ క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా భవిష్యత్తులో బాలకృష్ణతో సినిమా చేయబోను అంటూ  కరాఖండిగా చెప్పేశారు వర్మ.

మరింత సమాచారం తెలుసుకోండి: