లోకంలో పాతతరం మహిళలను తీసుకుంటే వారికి మగవాళ్ల నుండి ఇంతగా వేధింపులు ఉండేవి కాదు. ఆకాలంలో నిండైన కట్టుబొట్టుతో చూడగానే పవిత్ర భావం కలిగేలా కేవలం ముఖం మరియు పాదాలు తప్పా మరేవి కనబడకుండా చక్కని సంస్కారవంతంగా జీవించే వారు. కాని ఎప్పుడైతే ఆడవాళ్లూ మాకు మగవాళ్లతో పాటుగా సమాన హక్కులు కావాలి అని బయట ప్రపంచంలోకి రావడం మొదలు పెట్టారో అప్పటి నుండి స్టార్ట్ అయ్యాయి వారికి వేధింపులు.

 

ఇదే గాక ఒళ్లు దాచుకోకుండా చూపించే బట్టలు వేసుకుని నలుగురిలో తిరగడం అదేమంటే మా ఒళ్లూ మాయిష్టం నీవెవరు అంటూ కొందరూ ప్రశ్నిస్తున్నారు. ఇకపోతే సినిమా రంగంలో కూడా ఈ వేధింపులు చాలా ఉన్నాయని ఇదివరకే ఎందరో నటీమణులు రచ్చచేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కాస్టింగ్ కౌచ్ అనేది పునాదులతో సహా ఇండస్ట్రీలో పాతుకుపోయింది. దాన్ని కూకటివేళ్లతో సహా పెకలించి వేస్తామని ఎవరెన్ని కబుర్లు చెప్పినా కూడా అంత ఈజీగా అయ్యే పని కాదు. ఆ విషయం వాళ్లకు కూడా తెలుసు.

 

ఇప్పటికే ఎన్నో మీటూ కేసులు చూసాం.. శ్రీ రెడ్డి లాంటి వాళ్లు ఎన్నో ఉద్యమాలు చేసారు. ఆ తర్వాత అదే ఉద్యమాన్ని వ్యక్తిగత విషయాల కోసం వాడుకుని తప్పుదారి పట్టించిన వాళ్లు కూడా ఉన్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో హీరోయిన్ మాధవిలత కూడా ఇదే ఇష్యూపై మాట్లాడింది. దర్శక నిర్మాతల కోరిక తీరిస్తే కానీ తమ టాలెంట్ వాళ్లకు కనిపించదని సంచలన వ్యాఖ్యలు చేసింది.  

 

బ్యూటీ నచ్చావులే అంటూ తెరపైకి వచ్చి.. స్నేహితుడా చిత్రంలో నాని తో జతకట్టింది.. ఇక మాధవి తెలుగమ్మాయి కావడంతో ఇక్కడ పెద్దగా అవకాశాలు రాలేదని, దాంతో కొన్ని సినిమాలకే కనుమరుగైపోయిందని అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే కమిట్‌మెంట్ అనేది చాలా పవిత్రమైన పదమని.. కానీ దాన్ని మనోళ్లు చెండాలం చేసారని అంటుంది మాధవి..

 

ఇప్పుడున్న పరిస్దితుల్లో కమిట్మెంట్ అంటే పడుకోవడం అనే అర్థానికి దిగజార్చారని చెబుతుంది. కాని అసలు అర్ధం అది కాదని,  కమిట్మెంట్ అంటే ఒప్పుకున్న సినిమా పూర్తి చేయడం అనే భావం వస్తుందని. కానీ మన దర్శక నిర్మాతలు మాత్రం ఇప్పుడు కమిట్మెంట్ అంటే పడుకోవడానికి వస్తావా అన్నట్లు మార్చేసారంటు తెలిపింది..

 

ఇకపోతే తనను కూడా అప్పట్లో కమిట్మెంట్ అడిగారని, అయితే వాళ్ల ఆలోచన అర్థం చేసుకుని నో చెప్పినట్లు చెప్పింది మాధవిలత.. మొత్తానికి పడకగదికి వెళ్లి వాళ్ల కామవాంఛ తీరిస్తే తప్ప తెలుగులోనే కాదు.. ఎక్కడా హీరోయిన్లకు అవకాశాలు వచ్చే పరిస్థితి లేదని ఘాటు వాఖ్యలు చేసింది మాధవిలత. 

మరింత సమాచారం తెలుసుకోండి: