తెలుగు సినిమాలు తమిళంలో ఇటీవల కాలంలో డబ్బింగ్ చేసుకుంటున్నాయి.  డబ్బింగ్ చేసుకొని రిలీజ్ అవుతుంటాయి.  అయితే, కొన్ని సినిమాలు మాత్రం ఆలస్యంగా డబ్బింగ్ చేసుకొని రిలీజ్ చేస్తుంటారు.  రాజమౌళి సినిమాలు దాదాపుగా తమిళంలో కూడా రిలీజ్ అవుతుంటాయి.  మగధీర, ఈగ, బాహుబలి సినిమాలు తమిళంలో కూడా మంచి విజయాలు సాధించాయి. బాహుబలి సినిమా అక్కడ కూడా ఎన్నో రికార్డులు సొంతం చేసుకుంది.  


ఇదే ఊపులో వచ్చిన ప్రభాస్ సాహో పరాజయం పాలైంది.  ఇక ఇదిలా ఉంటె, ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్లో 12 సంవత్సరాల క్రితం యమదొంగ అనే సినిమా వచ్చింది.  ఈ సినిమా గురించి అందరికి తెలిసిందే.  ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.  అప్పట్లో హిట్స్ కోసం ఇబ్బంది పడుతున్న తారక్ కు యమదొంగ సినిమాతో బంపర్ హిట్ అందించాడు.  


కాగా, ఇప్పుడు మరలా ఎన్టీఆర్, రామ్ చరణ్ తో రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.  ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నది.  ఇదిలా ఉంటె, 12 ఏళ్ల క్రితం తెలుగులో రిలీజ్ అయ్యి దుమ్మురేపిన యమదొంగ సినిమాను ఇప్పుడు తమిళంలో డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నారు.  12 ఏళ్ళ తరువాత సినిమా అక్కడ రిలీజ్ కాబోతుండటం విశేషం.  


రాజమౌళి సినిమాలకు క్రేజ్ ఉండటంతో ఈ సినిమాను అక్కడ ఇప్పుడు రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు.  దాదాపుగా డబ్బింగ్ పనులు పూర్తయినట్టు తెలుస్తోంది.  శివాజీ గణేశన్ మయనుక్కు యమన్, రజినీకాంత్ అదిశయ పిరవి సినిమాల బాటలోనే ఈ సినిమా కూడా ఉంటుంది.  ఎన్టీఆర్ సినిమాను విజయన్ పేరుతో డబ్బింగ్ చేసి రిలీజ్ చేయబోతున్నారు.  డబ్బింగ్  సినిమా అయినప్పటికీ దీనిని అక్కడ బాగానే ప్రమోట్ చేస్తున్నట్టు తెలుస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: