అందం ఉంటే లాభమేంటి. దాన్ని చూసే కళ్ళుండాలిగా. అందుకే అద్దం ఎపుడూ అందానికి బెస్ట్ ఫ్రెండ్ అంటారు. అందం చూపించే అద్దం ఎన్నో వూసులు చెబుతొంది. మరి చూసే కళ్ళు ఎన్ని భాష్యాలు చెబుతాయో కదా. అందుకే అందం ఆరబోతతో ఆకళ్ళ ఆకళ్ళు తీర్చాలనుకుంటారు కొంతమంది త్యాగమూర్తులు. ఇపుడు ఆ కోవలోకి మన తెలుగందం  పూజిత పొన్నాడ చేరింది. ఆమె స్టన్నింగ్  బ్యూటీతో సోషల్ మీడియాను తెగ రెచ్చగొడుతోంది.

 

అందం అంటే నాది. చూసే కళ్ళకు జన్మ ధన్యమే అంటూ పూజిక ఇస్తున్న స్టిల్స్ కచ్చితంగా కుర్రకారుకు కాక పుట్టించేవే. అందం శరణం గత్యామీ అనిపిస్తున్న పూజిత‌ తాను ఎక్కడా తగ్గను అంటోంది. తెలుగు అమ్మాయిలు ఏం తక్కువ తినరు అని కూడా ప్రూవ్ చేస్తోంది. లేటెస్ట్ గా సోషల్ మీడియాలో పూజిత వివిధ భంగిమల్లో పెట్టిన పిక్స్ పిచ్చెక్కించేస్తున్నాయని కామెంట్స్ వెల్లువలా వచ్చి పడుతున్నాయి.

 

ఇక పూజిత పొన్నాడ ఎవరంటే గత ఏడాది రిలీజ్ అయి బిగ్ హిట్ కొట్టిన రంగస్థలం మూవీలో ఆది కి జోడీగా మెరిసిన అందమైన మెరుపు తీగ. ప్రకాష్ రాజ్ కూతురుగా ఈ మూవీలో కనిపించిన పూజిత ఆ అందం ధగధగలతో 'వేర్ ఈజ్ వెంకట లక్ష్మి', 'బ్రాండ్ బాబు', 'సెవెన్' సినిమాల్లో కూడా  నటించింది. 

 

తెలుగు భాష అని మొత్తుకుంటున్న టాలీవుడ్ ప్రముఖులు తెలుగు అందాలకు అసలు అవకాశాలు ఇవ్వరు. ఇస్తే బాలీవుడ్ బ్యూటీలను తలదన్నే అందం, అభినయం తమకూ ఉందని పూజిక గట్టిగానే సవాల్ చేస్తోంది. ఇక మరో తెలుగు అందం ఈషా రెబ్బ కూడా సోషల్ మీడియా బ్యూటీగా టాప్ రేసులో ఉంది. మరి ఇంతటి తెలుగు అందాల బొమ్మలు ఉండగా పర భాషా వ్యామోహంతో పరుగులు తీస్తున్న మన ఫిల్మ్ మేకర్స్ ఒక్కసారి కనుక ఆలోచిస్తే పూజిత‌ టాలీవుడ్ టాప్ ర్యాంకర్ అవడం ఖాయం అంటున్నారు. చూడాలి మరి ఈ రెచ్చగొట్టుడుకు ఎంత ఫలితం ఉంటుందో.

 

మరింత సమాచారం తెలుసుకోండి: