అల్లు అర్జున్ సుకుమార్మూవీ షూటింగ్ ఇంకా ప్రారంభం కాకుండానే ఈ మూవీ షూటింగ్ కు అనుమతులు లేకపోవడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. ఈ మూవీ కథ అంతా శేషాచలం కొండలలో జరిగే గంధపు చక్కల స్మగ్లింగ్ చుట్టూ తిరిగే నేపధ్యంలో ఈ మూవీ షూటింగ్ ను సుకుమార్ సహజత్వం కోసం దట్టమైన శేషాచలం అడవులలో ఈ మూవీకి సంబంధించిన కీలక సీన్స్ ను తీయడానికి ఇప్పటికే యాక్షన్ ప్లాన్ తయారు చేసుకున్నాడు. 

ఈ సన్నివేశాల చిత్రీకరణ కోసం సుకుమార్ ఇప్పటికే శేషాచలం అడవులలోని కొండలు లోయలు దాటుకుని వెళ్లి లొకేషన్లు వెతికి ఎంపిక చేసుకున్నాడట. దీనికోసం తమిళనాడు ఆంధ్ర బార్డర్ కర్ణాటక సరిహద్దు ప్రాంతానికి సంబంధించిన దట్టమైన ఫారెస్ట్ ఏరియాను సుకుమార్ ఎంపిక చేసుకున్నట్లు టాక్. 


అయితే ఈ దట్టమైన అటవీ ప్రాంతంలో షూటింగ్ చేయడానికి అటవీ శాఖ అధికారులు సుకుమార్ కు తమ అనుమతులు నిరాకరించినట్లు తెలుస్తోంది. అత్యంత ప్రమాదకరమైన ఈ అడవుల్లో పులులు సింహాలదే రాజ్యం. అలాంటి చోట షూటింగులకు అనుమతులు అంటే అధికారులు విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే అనుమతులను నిరాకరించినట్లు తెలుస్తోంది. 

దీనితో చేసేదిలేక సుకుమార్ ఇప్పుడు తన సినిమాకు సంబంధించి షూటింగ్ స్పాట్ ను  బ్యాంకాక్ కు మార్చినట్లు తెలుస్తోంది. బ్యాంకాక్ అడవులునే శేషాచలం అడవులుగా చూపెడుతూ ఈ మూవీని తీయబోతున్నారని సమాచారం. ఇప్పటికే ఈ సినిమాలోని బన్నీ లుక్ ‘ఖైదీ’ సినిమాలో కార్తీ లుక్ ను పోలి ఉంటుంది అని లీకులు వస్తున్న సందర్భంలో ఈ మూవీలో బన్నీ లుక్ ను డిఫరెంట్ గా చూపెట్టడానికి సుకుమార్ మరిన్ని కొత్త ఆలోచనలు చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి బన్నీ బాడీ లాంగ్వేజ్ లో కూడ మార్పులు చేయాలని ఆలోచాలలో ఉన్నాడు సుకుమార్.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: