వచ్చేనెల విడుదల కాబోతున్న సాయి ధరమ్ తేజ్ ‘ప్రతిరోజు పండుగే’ సినిమాకు సంబంధించి ఒక కొత్త సెంటిమెంట్ ను దర్శకుడు మారుతి బయట పెట్టాడు. తాను దర్శకత్వం వహించే సినిమాకు సంబంధించిన కథను చిరంజీవి వింటే ఆ మూవీ సూపర్ హిట్ అవుతుంది అంటూ మారుతి ఒక కొత్త సెంటిమెంట్ ను నమ్ముకుంటున్నాడు.  

గతంలో ‘భలే భలే మగాడివోయ్’ మూవీ కథను ముందుగా తాను చిరంజీవికి చెప్పానని ఆ కథ చాల బాగుంది అని చిరంజీవి అప్పట్లో చెప్పడంతో ఆ మూవీ నిజంగానే సూపర్ హిట్ అయిన విషయాన్ని గుర్తుకు చేసుకున్నాడు. అదేవిధంగా ‘ప్రతిరోజు పండుగే’ మూవీ కథను తాను చిరంజీవికి మూడు గంటల పాటు వినిపించానని ఒక్క క్షణం కూడ అసహనానికి గురి అవ్వకుండా చిరంజీవి తన కథను విన్ననాడే తన సినిమా సూపర్ హిట్ అవుతుందని భావించానని మారుతి చెపుతున్నాడు.

సాధారణంగా మనిషి పుట్టుకను సెలిబ్రేట్ చేసుకునే జనం ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆ సంఘటనను సెలిబ్రేట్ చేసుకోరని అయితే పుట్టుకతో పాటు మరణాన్ని కూడ అందరు సెలిబ్రేట్ చేసుకోవాలి అన్న పాయింట్ చుట్టూ అల్లబడ్డ ఈ కథ అందరికీ నచ్చుతుంది అంటున్నాడు మారుతి. మార్కెట్ పడిపోయిన సాయి ధరమ్ తేజ్ ఈమధ్య కాలంలో హిట్స్ లేని మారుతి కలిసి చిరంజీవి సెంటిమెంట్ ను నమ్ముకుని తీస్తున్న ఈమూవీ వీరిద్దరి కెరియర్ కు చాల కీలకంగా మారింది.

దీనికితోడు ఈ మూవీని డిసెంబర్ 20న విడుదల చేసే సమయంలో అనేక సినిమాల పోటీ ఈ మూవీకి ఎదురౌతోంది. దీనితో ఇన్ని సినిమాల పోటీ మధ్య క్రిస్మస్ వార్ విజేతగా సక్సస్ అవ్వాలి అంటే సాయి తేజ్ మారుతులకు అదృష్టంతో పాటు చిరంజీవి సెంటిమెంట్ కూడ పూర్తిగా కలిసిరావాలి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: