విలక్షణనటుడు కమల్ హాసన్  ఇండస్ట్రీలోకి వచ్చి 60 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఈమధ్య చెన్నైలో జరిగిన ఒక సన్మాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వచ్చిన రజనీకాంత్ తమిళ నాడుముఖ్య మంత్రిని టార్గెట్ చేస్తూ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. 'అద్భుతాలు మన చుట్టూనే జరుగుతూ ఉంటాయి. రెండేళ్ల కిందట ఎడపాటి పళనిస్వామి ముఖ్యమంత్రి అవుతారని ఎవరైనా అనుకున్నారా? ఆయన ముఖ్యమంత్రి అయ్యాకా అయినా ఇన్నాళ్లు పదవిలో ఉంటారని ఎవరైనా అనుకున్నారా? ఎప్పుడు ఎవరికి ఎలాంటి టైమొస్తుందో ఎవరూ చెప్పలేం' అంటూ రజనీకాంత్ చేసిన కామెంట్స్ తమిళ తమిళ రాజకీయాలలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. 

దీనితో రజినీకాంత్ ఏకంగా తమినాడు ముఖ్యమంత్రిని జాక్ పాట్ సిఎమ్ గా అభివర్ణిస్తూ మాటాడటం వెనుక కారణాలు ఏమిటి అంటూ ఇండస్ట్రీ వర్గాలలో ఆ సక్తికర చర్చలు జరుగుతున్నాయి. ఈ మధ్య తమిళనాడు ముఖ్యమంత్రి పళనీ స్వామి రజినీకాంత్ ను ఇందైరేక్ట్ గా టార్గెట్ చేస్తూ రజినీ రాజకీయాలలోకి వస్తే గతంలో తమిళ స్టార్ శివాజీ గణేష్ కు ఎటువంటి పరిస్థితి వచ్చిందో అలాంటి పరిస్థితి వస్తుందనీ పరోక్షంగా కామెంట్స్ చేసారు.
 
ఆ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న రజినీకాంత్ తమిళనాడు ముఖ్యమంత్రిని డైరెక్ట్ గా టార్గెట్ చేస్తూ తన రేంజ్ ఏమిటో చూపించే విధంగా కామెంట్స్ చేసి ఉంటారు అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రజినీకాంత్ రాబోయే ఎన్నికలలో పోటీ చేయగలడా అని సెటైర్లు వేస్తున్న వారికి తన రేంజ్ ఏమిటో చూపించదానికి ఇలా కమలహాసన్ సన్మాన వేదికను ఒక అస్త్రంగా మార్చుకున్నాడు అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.  

సంక్రాంతికి రాబోతున్న ‘దర్బార్’ సక్సస్ ని బట్టి రజినీకాంత్ రాజకీయాలలో తన వేగం పెంచే విషయం గురించి ఒక కీలక నిర్ణయం తీసుకునే ఆస్కారం ఉంది అని అంటున్నారు. ఏమైనా రజనీకాంత్ నోటివెంట ఇప్పుడు పవర్ ఫుల్ పొలిటికల్ పంచ్ లు పడుతూ ఉండటంతో అభిమానులు మంచి జోష్ లో ఉన్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: