టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత ఎంతో మంది హీరోయిన్లకు ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. సమంత  క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. హీరోల రేంజ్ లో క్రేజ్ సంపాదించింది ఈ అమ్మడు . పెళ్లికి ముందు గ్లామర్ పాత్రల్లో  మెరిసి ప్రేక్షకుల మతి పోగొట్టిన ఈ అమ్మడు... పెళ్లి తర్వాత మాత్రం ఒక గొప్ప నటిగా ఎదిగింది. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు మాత్రమే చేసుకుంటూ వరుస విజయాలను సొంతం చేసుకుంటూ  దూసుకుపోతుంది ఈ అమ్మడు. ఇక ఇప్పుడు దర్శకులు అందరికీ కేరాఫ్ లేడీ ఓరియెంటెడ్ సినిమాస్ అన్నట్లుగా మారిపోయింది సమంత. అయితే మొదటి సినిమామాయ చేసావే సినిమాతోనే... నాగచైతన్యను  మాయ చేసి తన బుట్టలో వేసుకుంది  ఈ అమ్మడు ఇక ఆ తర్వాత చాలా రోజుల తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. అయితే టాలీవుడ్ లో ఈ జంట కి ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఈ జంట ఏ  కార్యక్రమానికి వెళ్లిన సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా ఉండి పోతారూ . వీరిద్దరి మధ్య జరిగే లవ్లీ కాన్వర్సేషన్ కూడా అందరినీ ఆకర్షిస్తూ ఉంటుంది. 

 

 

 

 అయితే రియల్ జోడి ఈ సంవత్సరం ప్రారంభంలో రీల్ లైఫ్లో కూడా మజిలీ  సినిమాలో జోడిగా నటించి  మంచి విజయాన్ని అందుకున్నారు. అయితే ఈ అమ్మడు ఈ  సంవత్సరం బాగా కలిసి వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే సమంత చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలను నమోదు చేస్తున్నాయి. ఇదిలా ఉండగా  అక్కినేని అభిమానులు సమంత పెళ్లయినప్పటి నుంచి ఈ జంట  ఎప్పుడు తీపికబురు చెబుతారని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ అభిమానులతో చిట్  చాట్ చేసే సమంతకి.. అభిమానులు నెటిజన్ల నుంచి ఇలాంటి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అంతేకాకుండా ఈ మధ్య సోషల్ మీడియాలో తల్లి కాబోతున్న సమంత అంటూ కొన్ని వదంతులు కూడా హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. 

 

 

 

 అయితే సోషల్ మీడియాలో అభిమానులు కూడా సమంతను ఇలాంటి ప్రశ్నలు అడగడం సమంత కూడా తనదైన శైలిలో జవాబు ఇవ్వడం ఎన్నో సార్లు జరిగింది. తాజాగా ఇదే విషయమై తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఓ నెటిజన్ ప్రశ్నించాడు . మీరు ఎప్పుడు తల్లి కాబోతున్నారు అంటూ ఓ నెటిజన్  అడిగిన ప్రశ్నకు సమంత వ్యంగ్యంగా సమాధానం ఇచ్చారూ . 2022 సంవత్సరంలో ఆగస్టు 7న ఉదయం ఏడు గంటలకు ఓ బిడ్డకు జన్మనిస్తా  అంటూ చెప్పింది సమంత. ఇదిలా ఉండగా తాజాగా సమంత తమిళ హిట్ మూవీ 96 రీమేక్ లో శర్వానంద్ కు జోడిగా నటించిన విషయం తెలిసిందే అంతేకాకుండా ప్రస్తుతం వెబ్ సిరీస్ లో విలన్ గా కూడా నటించబోతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: