అల్లు అర్జున్ దక్షిణాది సినిమా రంగములో మంచి నటుడు. ఇతడు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు, హాస్య నటుడు పద్మశ్రీ అల్లు రామలింగయ్య మనవడు, చిరంజీవి మేనల్లుడు. తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగళూరు, కేరళలో అల్లు అర్జున్ కు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఫేస్ బుక్ లో సుమారు దాదాపు కోటి మంది అభిమానులు ఉన్నారు అంటే నమ్మండి. కేరళ లో ఉన్న అల్లు అర్జున్ అభిమానులు బన్నీ ని మల్లు అర్జున్ అని పిలుస్తారు. అల్లు అర్జున్ చెన్నైలో పుట్టాడు. పద్దెనిమిదేళ్ళ వరకు అక్కడే పెరిగాడు. 

 

అతని తల్లిదండ్రులకు ముగ్గురు పిల్లల్లో ఒకడు. పెద్దన్నయ్య వెంకటేష్, తమ్ముడు శిరీష్. చెన్నైలోని పద్మ శేషాద్రి పాఠశాలలో చదువుకున్నాడు. కానీ ఎంత కష్టపడి చదవినా అంతంత మాత్రంగానే మార్కులు  వచ్చేవి. చిన్నప్పుడే విజేత సినిమా చిత్రీకరణ చూడ్డానికి వెళ్ళినపుడు ఆ చిత్రంలో ఓ చిన్నపిల్లవాడి పాత్రలో మొదటి సారిగా నటించాడు. అల్లు అర్జున్ మొదటి చిత్రం కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన గంగోత్రి. అల్లు అర్జున్ ఫాషన్ మరియు స్టైల్ కు పెట్టింది పేరు అని చెప్పవచ్చు. గంగోత్రి అప్పటిలో రికార్డు బద్దలు కొట్టింది. 

 

చిన్నప్పటి నుంచే అర్జున్ డ్యాన్స్ అంటే అమితాసక్తిని కనబరిచేవాడు. ఇంట్లో ఏదైనా శుభసందర్భాల సమయంలో చిరంజీవి కుమారుడైన రామ్‌చరణ్ తేజ్, అర్జున్ చిన్నతనంలో నృత్యాలు పోటీలు పడి చేసేవారు. మొదట్లో అర్జున్ నటుడు కావడానికి తల్లి కొద్దిగా సందేహించినా, తరువాత కుమారుని కోరికను కాదనలేకపోయింది. ఇతని అల్లు అర్జున్  అందరూ బన్నీ అని కూడా పిలుస్తారు.వివాహము హైదరాబాదుకు చెందిన స్నేహారెడ్డితో జరిగింది. వీరికి అయాన్ అనే కుమారుడు, అర్హ అనే కుమార్తె ఉన్నారు.

 

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘అల.. వైకుంఠపురములో చిత్రం తీశారు. ఈ చిత్రానికి త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. దువ్వాడ జగన్నాథ్‌ తో మంచి హిట్‌ అందుకున్న పూజా-బన్నీ జంట ఈ చిత్రంతో మరోసారి వెండితెరపై సందడి చేయనుంది. ఈ చిత్రంలో కాజల్‌ ఓ ప్రత్యేక గీతంలో తళుక్కుమననున్నారు.ఇప్పటికే విడుదలైన ‘సామజవరగమన’, ‘రాములో రాములా’.. పాటలు అన్నివర్గాల ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అప్పట్లో తీసిన గంగోత్రి, ఇద్దరమ్మాయిలతో, బన్నీ, దువ్వాడ జగన్నాథం, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలు అల్లు అర్జున్ కు మంచి పేరు ప్రఖ్యాతులను సొంతం చేసుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: