హీరోయిన్స్ కి పెళ్లి అవ్వగానే వారిని బాగా వేధించే ప్రశ్న ఏంటంటే 'మీరు ఎప్పుడు తల్లి కాబోతున్నారు?' ఇటు మీడియాలో అటు ఫాలోవర్స్ లో ప్రతి ఒక్కరూ ఈ ప్రశ్న వేసి చాలా విసిగిస్తూ ఉంటారు. వార్తల విషయానికొస్తే ప్రెగ్నెన్సీ రాకపోయినప్పటికీ ఆ డ్రెస్సులో ఆ హీరోయిన్ కడుపు ఉబ్బెత్తుగా ఉంది.. సో, ఆమె ప్రెగ్నెంట్ అయింది అంటూ ఎన్నో పుకార్లు ఇంటర్నెట్ అంతా వ్యాపిస్తాయి. దాంతో తట్టుకోలేక స్వయంగా సెలబ్రిటీసే స్పందించి మాకు ఏ ప్రెగ్నెన్సీ రాలేదని చెప్తారు. ఇలాంటి సంఘటనలు కోకొల్లలు. ప్రస్తుతం 2 ఏళ్ల క్రితం మ్యారేజ్ చేసుకున్న సమంత అక్కినేని ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటోంది.

 

సమంత అక్కినేని ఇటీవల తన 96 తమిళ్ రీమేక్ సినిమా షూటింగ్ పూర్తి చేసింది. ప్రస్తుతానికి ఆమె మరొక సినిమాలో నటిస్తుంది. కొద్ది రోజుల క్రితం ఆ సినిమా షూటింగ్ కోసం పూణే వెళ్లారు సమంత. ఆ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న అనంతరం ఆమె విమానంలో తిరిగి బయలుదేరారు. ఏవో కారణాలవల్ల విమానం ఆలస్యమైంది. దాంతో ఈ సమయాన్ని తన ఫాలోవర్స్ తో పంచుకుందామనే ఉద్దేశంతో ఇంస్టాగ్రామ్ లో కి లైవ్ లోకి వచ్చింది.

 

అయితే సమంతని తన ఫాలోయర్స్ఈ క్రింది విధంగా ప్రశ్నలు అడిగారు. సమంతా గారు మీరు నటి ఎలా అయ్యారు అని ఒక అభిమాని అడగగా... 'నేను నటన మీద శ్రద్ధ పెట్టడం వల్ల అయ్యానేమో' అని సమంత సమాధానమిచ్చాడు. ఇంకొక వ్యక్తి ఇలా అడిగాడు.. మీ నెక్స్ట్ సినిమాలు ఏంటి? .. 'నేను ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ లు చేస్తున్నాను. అవి మీకు చాలా బాగా నచ్చుతాయి అని ప్రామిస్ చేస్తున్నాను' అని సమాధానం ఇచ్చింది. 

 

ఇంకొక ఫాలోవర్ 'మీకు బాబు ఎప్పుడు జన్మిస్తాడు? అని ప్రశించాడు.  ప్రశ్నతో విసిగిపోయిన సమంత.. ‘నేను తల్లి కావాలని ఎదురుచూస్తున్న వారికి ఇదే నా సమాధానం. 2022 ఆగస్టు 7న ఉదయం 7 గంటలకు నా బేబీ జన్మించబోతున్నాడు’ అని సీరియస్‌గా అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: