టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మూవీలో ఒక హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి ఎన్టీఆర్ నటిస్తున్న ఈ పీరియాడికల్ మూవీపై టాలీవుడ్ సహా దేశవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలు నెలకొని ఉన్నాయి. దర్శకధీరుడు రాజమౌళి, బాహుబలి రెండు భాగాల తరువాత తెరకెక్కిస్తున్న సినిమా కావడం, అలానే తొలిసారిగా మెగా, నందమూరి ఫ్యామిలీలకు చెందిన ఇద్దరు స్టార్ హీరోలు ఒకే సినిమాలో కనిపించబోతుండడంతో ఆయా హీరోల ఫ్యాన్స్ అంచనాలు అయితే మరింత తారా స్థాయిలో ఉన్నాయి అని చెప్పాలి. ఇక గత ఏడాది మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అరవింద సమేత లో హీరోగా నటించిన ఎన్టీఆర్

 

ఆ వెంటనే ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో జాయిన్ అయ్యారు. ఇక ఇప్పటికే దాదాపుగా ఏడాది నుండి షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది జులై 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమా అనుకున్న సమయానికి రిలీజ్ అయ్యే పరిస్థితులు కనపడడం లేదని అంటున్నారు. ఇప్పటికే మధ్యలో పలు మార్లు వాయిదా పడిన ఈ సినిమాకు షూటింగ్ తో పాటు విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ చాలావరకు పెండింగ్ లో ఉందని, కాబట్టి అది మరింత ఆలస్యం అయ్యే అవకాశం కనపడుతుండడంతో, 

 

సినిమాను 2021 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని చూస్తోందట ఆర్ఆర్ఆర్ మూవీ టీమ్. అయితే ప్రస్తుతం ఇది ప్రచారం అవుతున్న వార్త మాత్రమే, ఇంకా దీనిపై అధికారిక ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది. ఇక ఒకవేళ ఇదే కనుక జరిగితే, ఎన్టీఆర్ దాదాపుగా రెండున్నరేళ్లకు పైగా తన ఫ్యాన్స్ కు స్క్రీన్ మీద దర్శనం ఇచ్చే ఛాన్స్ లేనట్లే, అలానే రామ్ చరణ్ ఫ్యాన్స్ పరిస్థితి కూడా దాదాపుగా ఇదే అని తెలుస్తోంది. మరి ఆర్ఆర్ఆర్ అనుకున్న మేరకే రిలీజ్ అవుతుందా లేక వాయిదా పడుతుందా అనేది మాత్రం తెలియాల్సి ఉంది....!!

మరింత సమాచారం తెలుసుకోండి: